Homeజిల్లాలుఅనంతపురంపాలీసెట్–2026కు ఉరవకొండలో అన్ని ఏర్పాట్లు పూర్తి

పాలీసెట్–2026కు ఉరవకొండలో అన్ని ఏర్పాట్లు పూర్తి

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఈనెల 25వ తేదీన ఉరవకొండలో తొలిసారిగా నిర్వహించనున్న పాలీసెట్–2026 పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కోఆర్డినేటర్ కె. అశ్రఫ్ అలీ తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఈసారి మొత్తం 503 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.
పరీక్ష నిర్వహణ కోసం రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులు తప్పనిసరిగా ఉదయం 9 గంటలలోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. విద్యార్థులు హాల్ టికెట్‌తో పాటు హెచ్‌బి లేదా 2బి పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ తీసుకురావాలని తెలిపారు. ఇంకా హాల్ టికెట్ పొందని వారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
పరీక్ష కేంద్రాల గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ (గర్ల్స్) హాల్ టికెట్ నంబర్లు 5991001 నుంచి 5991240 వరకు ఎస్.కె. గవర్నమెంట్ హై స్కూల్, ఉరవకొండ: హాల్ టికెట్ నంబర్లు 6001001 నుంచి 6001263 వరకు ఉంటుందని. పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని కోఆర్డినేటర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు