Monday, February 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి

అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంద్ర ధర్మవరం::ధర్మవరం నియోజకవర్గం లో రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డిఓమహేష్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తో పాటు పలువురు నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రేసిడెంట్ కాటమయ్య సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సహాయ కార్యదర్శి ఎర్రం శెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ,గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు, సన్న పెద్దన్న పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముసుగు మధు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా చాలా గ్రామాల్లో కొత్త రేషన్ కార్డు ల కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు అని తెలిపారు. ఇప్పటికే స్టోర్ బియ్యంతో జీవనం గడుపుతున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. గతం నుంచి ఈ సంక్షేమ పథకాల పేరుతో కొత్త రేషన్ కార్డులు ఆపడం సరైనది కాదు. అర్హత ఉన్న కూడా రేషన్ కార్డులు లేని వారు చాలా మంది వున్నారు అని గుర్తు చేశారు.అనేక సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని, రేషన్ కార్డు ద్వారానే ఆదాయ,ధ్రువీకరణ,ద్వారా చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది అన్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేషన్ కార్డులకు అర్హులైన వారిని ఎంక్వయిరీ నిర్వహించి రేషన్ కార్డులను మంజూరు చేయాలని తద్వారా చదువుకున్న విద్యార్థులకు, రేషన్ బియ్యం తోనే పూట గడుపుతున్న కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్న కుటుంబాలకు న్యాయం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, శ్రీధర్, శ్రీనివాసులు,బాలరంగయ్య, ఆదినారాయణ,శ్రీనివాసులు, చెన్న బుజంగం,కొండ, బాబు,గంగాధర్, రవీంద్ర, మల్లికార్జున,మరియు మహిళ సమాఖ్య తరపున లలితమ్మ, లింగమ్మ, ఈరమ్మ, ఆశా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు