Friday, May 2, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆర్డిటికీ ఎఫ్ సి ఆర్ ఏ నిధుల నిలుపుదలపై అఖిలపక్ష సమావేశం

ఆర్డిటికీ ఎఫ్ సి ఆర్ ఏ నిధుల నిలుపుదలపై అఖిలపక్ష సమావేశం

ధర్మవరం లో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

తీవ్రస్థాయిలో గళాన్ని వినిపించి రాజకీయ, ప్రజా సంఘాల పార్టీల నేతలు
విశాలాంధ్ర ధర్మవరం; ప్రభుత్వాలకు సమాంతరంగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్డిటి సంస్థకు ఎఫ్.సి.ఆర్.ఏ నిధులు నిలిపివేయడం సరైంది కాదని ధర్మవరం నియోజకవర్గ అఖిలపక్ష నాయకులు తీవ్రస్థాయిలో తమ గళాన్ని వినిపించారు. ఆర్డిటి సంస్థకు ఎఫ్.సి.ఆర్.ఏ నిధులు నిలిపివేయడంపై ఎన్జీవోస్ నందు రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ, సిపిఎం, జనసేన, సిపిఐ ఎంఎల్ , ఎమ్మార్పీఎస్,బిఎస్పీ డిహెచ్పిఎస్ తో పాటు అన్ని రాజకీయ పార్టీలు స్వచ్చంద సంస్థలు ప్రతినిధులు మేధావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఆర్డిటి అందిస్తున్న సేవలు ఆర్డిటి ఏ వర్గానికి ఏ మతానికో సంబంధించింది కాదని.. అన్ని సంస్థలతో సమానంగా ఆర్డిటిని చూడడం సరైనది కాదని తెలిపారు. ఆ సంస్థ అందించే సేవలు ఒకసారి పరిశీలించాలన్నారు. కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంత జిల్లాకి ఆర్డిటి ఒక వర ప్రసాదం అని ఆర్,డి,టి,సంస్థ జిల్లాలో పేదలకు అనేక సహాయ సహకారాలు అందించిందని ఎంతో మందికి విద్య వైద్యాన్ని అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మరోపక్క జిల్లా లో క్రీడాకారులను ఎంతోమందిని తయారు చేసినటువంటి సంస్థగా కరోనా లాంటి క్లిష్ట సమయంలో ప్రజలకు వైద్యం అందించి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టినటువంటి ఆర్డిటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీని కోసం అందరము రాజకీయాలకు అతీతంగా ప్రయత్నం చేయాలని కోరడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు ఉపాధ్యాయుల సంఘం స్టేట్ కౌన్సిలర్ సుధాకర్ గారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, సిపిఎం పట్టణ కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు జింక చలపతి, జనసేన పట్టణ అధ్యక్షులు శ్యామ్ కుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కేసగాళ్ల వెంకటేష్, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, సిఐటియూ జిల్లా నాయకులు జేవి రమణ, అయూబ్ ఖాన్,బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ వినయ్, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్,సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ,డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి,సిపిఐ మండల కార్యదర్శి బండల వెంకటేష్, ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య, పి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర, మహిళా సమాఖ్య తరఫున లలితమ్మ,లింగమ్మ,ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు