Monday, January 6, 2025
Homeఆంధ్రప్రదేశ్నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్..

నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్..

సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఓవైపు పోలీసుల తరపు న్యాయవాదులు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. బన్ని తరపు న్యాయవాదులు మాత్రం బెయిల్ కోసం గట్టిగా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చివరకు అల్లు అర్జున్‌కు బెయిల్ సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో పూచీకత్తు సమర్పించేందుకు, మేజిస్ట్రేట్ ముందు కొన్ని పత్రాలపై సంతకాలు చేసేందుకు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అల్లు అర్జున్ వెంట ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈలోపు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్‌కోర్టును అల్లు అర్జున్‌ ఆశ్రయించారు. ఓవైపు పోలీసుల తరపు న్యాయవాదులు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. బన్ని తరపు న్యాయవాదులు మాత్రం బెయిల్ కోసం గట్టిగా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చివరకు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో షూరిటీస్ సమర్పించేందుకు అల్లు అర్జున్‌ కోర్టుకు చేరుకున్నారు. పుష్ప2 బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ దగ్గర గత ఏడాది డిసెంబరు 4వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్‌ పిటిషన్‌పై గత నెల 30వ తేదీన వాదనలు పూర్తి కాగా శుక్రవారం ఈ పిటిషన్‌పై నాంపల్లిలోని రెండో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు అదనపు న్యాయమూర్తి వినోద్‌ కుమార్‌ తీర్పును వెల్లడించారు. ఈ కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై ఉండగా తాజాగా నాంపల్లి కోర్టు షరతులతో కూడిన సాధారణ బెయిల్‌ ఇచ్చింది. హత్య, హత్యకు సూత్రధారిగా అల్లు అర్జున్‌పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించవంటూ తాము చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించి బెయిల్‌ మంజూరు చేసిందని బన్ని తరపు న్యాయవాదులు తెలిపారు.

పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాల ప్రకారం ఈ కేసులో అల్లు అర్జున్‌పై మోపిన బీఎన్‌ఎస్‌లోని 105వ సెక్షన్‌ వర్తించదంటూ తాము వినిపించిన వాదనలను కోర్టు విశ్వసించిందని లాయర్లు చెప్పారు. కాగా, పోలీసులు పూర్తి చార్జిషీట్‌ దాఖలు చేసే వరకు 2 నెలల పాటు అల్లు అర్జున్‌ ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లరాదని తెలిపింది. రూ.50 వేల విలువ గల రెండు పూచీకత్తులు సమర్పించాలని షరతుల్లో పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులను, ఘటనతో సంబంధమున్న సాక్షులను ప్రభావితం చేయవద్దని అల్లు అర్జున్‌కు సూచించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు