పార్లమెంటు సాక్షిగా Dr బి.ఆర్.అంబేద్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి
దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వామపక్షాల డిమాండ్ సిపిఐ, సిపిఎం. నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గూర్చి అనుచిత వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని, తదుపరి దేశ ప్రజలకు తప్పనిసరిగా క్షమాపణలు చెప్పాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. తదుపరి పట్టణములోని
స్థానిక కళాజ్యోతి సర్కిల్ నందు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిపిఐ ఏఐటీయూసీ, ఎర్రం శెట్టి రమణ, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్ నారాయణ, సిపిఎం జిల్లా నాయకులు ఎస్, హెచ్, భాష సిఐటియు నాయకులు జెవి. రమణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురించి పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసి అంబేద్కర్ అవమానించడం దారుణమని తెలిపారు. భారతదేశ ప్రజల హక్కులను విధి విధానాలను. బడుగు బలహీన వర్గ ప్రజల హక్కులను. కార్మిక హక్కులను, భారతదేశ సౌభ్రాతృత్వాన్ని, లౌకిక తత్వాన్ని, ప్రజల సమాన తత్వాన్ని, ప్రజల అన్ని రకాలుగా స్వేచ్ఛస్వాతంత్రాలతో. వాక్ స్వాతంత్రాలతో జీవించడానికి అవసరమైన అన్నిటిని రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించి భారత దేశ ప్రజలందరూ బానిసత్వం నుంచి స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించడానికి అవసరం ఉన్న అన్ని విధివిధానాలను రూపొందించి, భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి దేశ ప్రజలందరూ ఆయన యొక్క శ్రమను ఔన్నత్యాన్ని గుర్తించి భారత దేశ ప్రజలు స్మరించుకుంటున్న నారని తెలిపారు. ఓర్వలేని భారత దేశ హోం మంత్రి ఆయనను కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉన్నదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని సైతం మార్పులు చేయడానికి అనేక రకాల కుట్రలు అవకాశాలు చూస్తున్నారని, రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత దేశ ప్రజలందరికీ ఉన్నదని, ఎంతో మహోన్నతంగా ఉన్న రాజ్యాంగం పట్ల దాడులు చేస్తున్న ఇటువంటి ప్రభుత్వానికి తగిన విధంగా ప్రజలు గుణపాఠం చెప్పాలని
తెలిపారు. హోం మంత్రి వెంటనే రాజీనామా చేసి భారతదేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని, దేశ ప్రధాని సైతం హోంమంత్రికి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి లక్ష్మీనారాయణ, సిఐటియు అయూబ్ రైతు సంఘం జిల్లా నాయకులు ఆలకుంట మారుతి, ఆదినారాయణ ,కదిరప్ప సిపిఐ నాయకులు శ్రీధర్, గంగాధర్ ,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నాగార్జున, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సకల రాజా నాయకులు ఆదినారాయణ, నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.