– ఘనంగా ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు
విశాలాంధ్ర – రాజానగరం : తల్లిపాలే బిడ్డకు అమృతాహారంగా ఉపయోగపడి శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెంచుతాయని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ వెంకటలక్ష్మి అన్నారు.
ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలను పురస్కరించుకొని
మండల కేంద్రమైన రాజానగరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మరియు జిఎస్ఎల్ బిఎస్సి నర్సింగ్ కళాశాల విద్యార్థులు సంయుక్తంగా కలిసి శుక్రవారం
అవగాహన ర్యాలీ నిర్వహించారు.దీనిలో భాగంగా స్థానిక పి హెచ్ సి నుండి ర్యాలీ చేపట్టి స్తానిక గాంధీ బొమ్మ కూడలి వద్ద మానవహారం చేపట్టారు.అలాగే తల్లి పాలు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా వైద్యులు డాక్టర్ సిహెచ్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ పిల్లలు పుట్టిన వెంటనే బిడ్డకు స్తన్యమివ్వడం చాలా అవసరమని, దీనిపై అవగాహన కల్పించేందుకే ఆగస్టు 1 నుండి ఆగస్టు 7వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.తల్లి పాలు తాగే శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధులు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్ఎన్ మంగతాయారు, హెల్త్ సూపర్వైజర్ ఎన్ వివి రమణ, ఏఎన్ఎంలు,
జిఎస్ఎల్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.గీత ప్రవీణ,వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య కె.విజయ పల్లవి, ఎన్ ఎస్ ఎస్ అధికారి జి.మాలిని, విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.
తల్లిపాలే బిడ్డకు అమృతాహారం
- Advertisement -
RELATED ARTICLES


