Thursday, April 3, 2025
Homeజిల్లాలుఅనంతపురంఅనంతపురం డి ఈ ఐ సి కేంద్రంలో ఆటిజం పై అవగాహన

అనంతపురం డి ఈ ఐ సి కేంద్రంలో ఆటిజం పై అవగాహన

విశాలాంధ్ర అనంతపురం : జిల్లా ప్రభుత్వాసుపత్రి (జి జి హెచ్) ఒపీ నెంబర్ 99 లో మంగళవారం ఆటిజం అవగాహన కార్యక్రమానికి ఆర్ బి ఎస్ కె, ఎన్ సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డా. జి. నారాయణస్వామి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. ఈ.బీ. దేవి హాజరై, ఆటిజం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ఈ మానసిక ఆరోగ్య కార్యక్రమం మనోవైద్య నిపుణుడు డా. విశ్వనాథ్ రెడ్డి, మానసిక వైద్య విభాగం నుండి వచ్చిన డా. రవి ఆటిజం లక్షణాలు, పిల్లల్లో కనిపించే సమస్యలు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సా విధానాలు గురించి విశదంగా వివరించారు. క్లినికల్ & చైల్డ్ సైకాలజిస్ట్ సుందరరావు సిరిగిరి ఆటిజం ఉన్న పిల్లల మానసిక, సామాజిక అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పాటించాల్సిన మార్గదర్శకాలను వివరించారు.
ఆటిజం కలిగిన పిల్లల అభివృద్ధికి తోడ్పడే విధంగా డి ఈ ఐ సి బృందం ఉచితంగా కలర్ బుక్స్, స్కెచ్ పెన్సిల్స్, కలర్ క్రేయాన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు