బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన కేసులో విచారణ నిమిత్తం యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్టేషన్‌కు సోమవారం హాజరయ్యారు. ఆమెకు సుమారు మూడు గంటల పాటు విచారణ కొనసాగింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో న్యాయస్థానం ఆమెను అరెస్టు చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణకు సహకరించాల్సిందిగా యాంకర్ శ్యామలకు సూచించింది.
హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్‌ల కోసం గాలింపు
బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన కేసులో యాంకర్ శ్యామలతో పాటు బయ్యా సన్నీ యాదవ్, అజయ్, సుధీర్ ను విచారించే అవకాశం ఉంది. అయితే మరో ఇద్దరు నిందితులు హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్‌లు ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. వీరిరువురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ రీతూచౌదరి, టీవీ యాంకర్ విష్ణుప్రియలు సైతం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే.