రిజిస్ట్రార్ ఆచార్య ఎస్. కృష్ణయ్య
విశాలాంధ్ర – జెఎన్టియు ఏ: ఏపీ ఈఏపి సెట్ 2025 పరీక్షకు సన్నద్ధత విద్యార్థుల నిరంతర సాధన తోనే విజయ శిఖరాలను అధిరోహించగలరని జవహార్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్యస్ కృష్ణయ్య పేర్కొన్నారు. పరీక్ష క్రమశిక్షణ, సమయపాలన, పుస్తకాలపై నిరంతర అధ్యయనం, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు అత్యధిక ప్రాధాన్యతమిస్తూ.. ఫిజిక్స్ జువాలజీ సబ్జెక్టులపై పట్టు సాధించాలని అన్నారు. ఆన్లైన్ పరీక్ష పై సాంకేతిక విజ్ఞానాన్ని , అనుభవాన్ని సాధించడానికి ఆన్లైన్ టెస్టుల్లో పాల్గొని సమయస్ఫూర్తి .. కష్టమైన సబ్జెక్టును ఎలా ఎదుర్కోవాలి.. సన్నద్ధత నైపుణ్యాలను , మేధస్సుకు పదును పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇష్టమైన సబ్జెక్టును పరీక్షలో ప్రారంభిస్తే మానసిక ఒత్తిడికి గురి కాకుండా.. లక్ష్యాన్ని చేదించడానికి దృఢ సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు. శారీరక దృఢత్వాన్ని కోల్పోకుండా… రోజు కొంత సమయాన్ని క్రీడలకు, నడక, యోగ చేయడం వల్ల మానసిక, శారీరక పటిస్వత్వాన్ని సాధించగలరు.
భవితకు భరోసా ఇంజనీరింగ్..
ఉజ్వల వికాస భవితకు ఇంజనీరింగ్ కోర్సు అండగా నిలుస్తుంది అన్నారు. సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ఇంజనీరింగ్ రంగంలో ఉపాధికి డోకా లేదు అని.. విద్యార్థులు ఆందోళన పడవలసిన అవసరం లేదన్నారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్, సివిల్, మెకానికల్, కెమిస్ట్రీ మొదలగు రంగాలలో ఉన్నత ప్రమాణాలకు నిలయంగా నిలుస్తూ.. పారిశ్రామిక పురోగతి, దేశ ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యభూమికను ఇంజనీరింగ్ పోషిస్తూ ఉందన్నారు. సమాజంలో ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలకు యువ ఇంజనీర్లు గా దేశ అభ్యున్నతిలో పాటుపడే అద్భుత అవకాశాన్ని ఇంజనీరింగ్ కోర్సు అందిస్తుందని అన్నారు. ఈ అవకాశము ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని విజయఫలాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.