ప్రిన్సిపాల్ గోవర్థిని
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని కెజిబివి పాఠశాల /కళాశాల లో 2025-26 విద్యాసంవత్సరమునకు 6వ తరగతి మరియు మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రవేశం కొరకు మార్చి 22 తేదీ నుండిఏప్రిల్ 11తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జె. గోవర్థిని గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మా కళాశాలలో 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరంనకు(ఎంపిసి)గ్రూపు వారికి అడ్మిషన్ లు జరుగుతున్నాయని 40 సీట్లు మాత్రమే ఉన్నాయని అన్నారు.7వ తరగతి 2సీట్లు, 8వ తరగతి 2సీట్లు ఖాళీగా ఉన్నాయని వాటికి కూడా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. (హెచ్ టీ టీ పీ ఎస్ ://ఏపీ కెజిబివి. ఏపీసీఎఫ్ఎస్ ఎస్. ఇన్ )ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నందు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.ఏమైనా సందేశాలు ఉంటే పాఠశాల లో సంప్రదించాలని అన్నారు.