Friday, May 2, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమైనారిటీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోండి..

మైనారిటీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోండి..

పురపాలక కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ముస్లిం, క్రిస్టియన్,భూధిస్ట్ ,సిక్, జైన్, పార్షి వార్షి మతస్తులలో మైనారిటీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 10వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారి వయోపరిమితి 21 సంవత్సరాల పైబడి 55 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని తెలిపారు. అదేవిధంగా మైనారిటీ ధ్రువీకరణ సర్టిఫికెట్ కలిగి ఉండాలని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ కూడా కలిగి ఉండాలని తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు