Tuesday, December 10, 2024
Homeఆంధ్రప్రదేశ్టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఉద్యోగిని నియమించండి……

టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఉద్యోగిని నియమించండి……

సంఘం పొదుపు డబ్బులు తీసుకునేందుకు ఇబ్బందులు

విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : రెండు నెలలు గడుస్తున్న టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఉద్యోగి లేనందున తీవ్ర ఇబ్బంది పడుతున్నామని పామిడి పట్టణం నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) లో ఉన్న మహిళా సంఘాలు సభ్యులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ పామిడి పట్టణంలొ గత 35 సంవత్సరాలు నుండి ఇప్పటివరకు 485 సంఘాలు ఏర్పాటు చేసుకున్నామని, ఈ 485 సంఘాల్లో 4892 మంది సభ్యులు ఉన్నారాన్నారు. సంఘంలో నుండి పొదుపు చేసుకున్న మొత్తంలో సంఘం సభ్యులు డబ్బులు డ్రా చెయ్యడానికి వెళ్ళగా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ వారి సంతకం లేనిది బ్యాంకు వారు డబ్బులు డ్రా చేయడానికి అనుమతి లేదని కావున సంఘం సభ్యులు అత్యవసరంగా మెప్మా ఉద్యోగి కొరకు వెళ్లగా గత రెండు నెలలుగా ఇక్కడ ఏ అధికారులు లేరని చెప్పడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 28 తేదీన మెప్మా అధికారిబదిలీపై వేరే పట్టణానికి వెళ్ళారని, బదిలీ చేసిన తారీకు నుండి ఏ అధికారిని నియమించలేదు కాబట్టి మెప్మా అధికారి మా గురించి పట్టణంలో సంఘాల సభ్యులు వివరణ అడగ్గా మీకు డిఆర్డిఏ వెలుగులో వెళ్ళమన్నారని అక్కడికి వెళ్ళగా తిరిగి వెనక్కి పంపించారన్నారు. పై అధికారులు వెంటనే స్పందించి త్వరలోనే అధికారిని నియమించాలని మహిళా సంఘాలు కోరుతున్నారు లేకుంటే ధర్నాలు,రిలే నిరాహారదీక్షలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు