Saturday, February 22, 2025
Homeఆంధ్రప్రదేశ్గ్రూప్‌-2 మెయిన్స్‌ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై క్లారిటీ ఇచ్చిన ఏపీపీఎస్‌సీ

గ్రూప్‌-2 మెయిన్స్‌ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై క్లారిటీ ఇచ్చిన ఏపీపీఎస్‌సీ

సోష‌ల్ మీడియాలో గ్రూప్‌-2 మెయిన్స్‌ ప‌రీక్ష‌లు వాయిదా అంటూ ప్ర‌చారం
రేపు ప‌రీక్ష‌లు య‌థాత‌థంగా జ‌రుగుతాయ‌ని క‌మిష‌న్ స్ప‌ష్టీక‌ర‌ణ‌
అభ్య‌ర్థులు 15 నిమిషాలు ముందుగానే ఎగ్జామ్ సెంట‌ర్ల‌కు చేరుకోవాల‌ని సూచ‌న‌

రేపు (ఆదివారం) జ‌ర‌గ‌నున్న గ్రూప్‌-2 మెయిన్స్‌ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఏపీపీఎస్‌సీ క్లారిటీ ఇచ్చింది. రేప‌టి గ్రూప్‌-2 మెయిన్స్‌ ప‌రీక్ష‌లు య‌థాత‌థంగా జ‌రుగుతాయ‌ని, సోష‌ల్ మీడియాలో ఎగ్జామ్స్ వాయిదా అంటూ జ‌రుగుతున్న త‌ప్పుడు ప్ర‌చారం న‌మ్మొద్ద‌ని బోర్డు తెలిపింది. ఉద‌యం 10.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు పేపర్-1, మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్‌-2 జ‌రుగుతుంద‌ని క‌మిష‌న్ తెలిపింది. అభ్య‌ర్థులు 15 నిమిషాలు ముందుగానే ఎగ్జామ్ సెంట‌ర్ల‌కు చేరుకోవాల‌ని ఏపీపీఎస్‌సీ సూచించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు