విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్తాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవ్ 70 వసంతాల ఉత్సవాలలో భాగంగా , మన అనంతపురం నందు సేవా కార్యక్రమములు చేపట్టినారు. అందులో భగంగా, మార్చి 1, బళ్లారి రోడ్‌లో వున్న లెప్రసీ గ్రామం నందు, ఆహార సామగ్రిణి అందజేశారు.ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ మమత మాట్లాడుతూ… వారి ఆరోగ్యం, రోగ నిరోధక శక్తిని పెంచుకొనేందుకు, యోగ. ధ్యానం, వాటి వల్ల లాభాలను తెలియ జేసారు, అలాగే, ఆరోగ్యo కోసం వ్యక్తిగత శుభ్రత , పరిసరల పరిశుభ్రత గురించి తెలియజేసారు. ఇందులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ రాష్ట్ర ఉపాధ్యాయ కో ఆర్డినేటర్ మమత గారు, మహాలక్ష్మి , విజయ లక్ష్మి , పుష్ప శంకర్ , డా . రేఖ (మానవత్వానికి సామరస్యం గ్రూప్ డైరెక్ట్ర్) స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం ను జయప్రదం చేసారు.


