విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి నాగార్జున తెలిపారు. ఈ శిబిరం యువర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగుళూరు శ్రీ శంకర క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ శిబిరమునందుడాక్టర్ బి ఎస్ శ్రీనాథ్ , ఇతర వైద్యుల బృందముచేయి 110 మందిని పరీక్షించి అందులో 25 మందికి పాప్ స్మియర్స్ పరీక్షలు 11 మందికి మామోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు అని తెలిపారు. ఈ పరీక్షల యొక్క ఫలితమును శంకర హాస్పిటల్ నందు పరీక్షించి, అనంతరం ఫలితములను పంపించడం జరుగుతుంది అన్నారు. ఈ శిబిరము నందు కొత్తపేట అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక వారి బృందము సేవలను అందించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమమునందు యువర్స్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ బి వి సుబ్బారావు, చాంద్ బాషా, పోలా ప్రభాకర్, సి రాధాకృష్ణ, మోహన, వై కే శ్రీనివాసులు, ఎస్ మల్లికార్జున ఎస్ రమేష్, సి కె రామాంజనేయులు, బండి నాగేంద్ర, ఓ వి ప్రసాద్, కౌన్సిలర్ కేతలోకేష్, నామాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమునకు విశేష స్పందన
- Advertisement -
RELATED ARTICLES


