టిడిపి నియోజకవర్గ వర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం; అంగన్వాడీలకు రెండుసార్లు వేతనాలు పెంచింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, మీ డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం అంగన్వాడీలు తమ డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా కొన్ని అంశాల గురించి ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి మేలు జరిగింది.. ఇప్పుడు ఏం జరుగుతోందన్నది పునఃపరిశీలన చేసుకోవాలని శ్రీరామ్ సూచించారు. జగన్ రెడ్డి అవలంభించిన విధానాలతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ అన్ని సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళ్తున్నారన్నారు. ఈ క్రమంలో అంగన్వాడీలకు గతంలో ఇచ్చిన హామీల గురించి కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తోందన్నారు. అయితే ఈ 20 నెలల కాలంతో పాటు గతంలో అంగన్వాడీలకు ఏం చేశామన్నది ఒక్కసారి వారే గమనించాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.86.68 లక్షలు విడుదల చేసి, ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు. అంగన్వాడీలకు ప్రతి నెల ఒకటో తేదీననే వేతనాలు అందేలా చర్యలు తీసుకుని, జీతాల ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెట్టిందన్నారు. 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్‌వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ.75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్‌ఫోన్లు అందించిందన్నారు. అంగన్వాడీ కేంద్రాల హాజరు 70 శాతం నుంచి 96 శాతానికి పెరగడం కూటమి పాలనకు వచ్చిన ప్రత్యక్ష ఫలితం కనిపిస్తోందన్నారు. ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురుచూసిన గ్రాట్యుటీ కలను కూటమి ప్రభుత్వం నిజం చేసిన విషయాన్ని ఎవరూ మర్చిపోవదన్నారు. గ్రాట్యుటీ చెల్లింపుల కోసం 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లోనే రూ.20 కోట్లు కేటాయించి, అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అంగన్వాడీలకు అండగా నిలిచిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తోందన్నారు. వేతనాల పెంపు అంశాన్ని కూడా వీలైనంత వరకు అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని.. దీనిని అంగన్వాడీలు గమనించాలని వారి విజ్ఞప్తి చేశారు.
అంగన్వాడీలకు 2 సార్లు వేతనాలు పెంచింది సీఎం చంద్రబాబే
- Advertisement -
RELATED ARTICLES


