Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅటల్ బిహారి వాజ్‌పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్-2 రౌండ్ టూ మ్యాచ్‌లు విజయవంతం

అటల్ బిహారి వాజ్‌పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్-2 రౌండ్ టూ మ్యాచ్‌లు విజయవంతం

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం;పట్టణంలోని ఆర్డిటి మైదానంలో శుక్రవారం 17వ రోజు, అటల్ బిహారి వాజ్‌పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్-2 పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగాయి. క్రికెట్ ప్రియుల సమక్షంలో జరిగిన ఈరోజు మ్యాచ్‌లు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
రోజు తొలి మ్యాచ్ బ్లూ క్యాప్స్ మరియు మైట్ వారియర్స్ జట్ల మధ్య సజావుగా జరిగింది. ఈ మ్యాచ్‌కు బీజేపీ నాయకులు పోతుకుంట రాజు టాస్ వేసి ప్రారంభించారు. బ్యాటింగ్‌లో మొదలైన బ్లూ క్యాప్స్ జట్టు 72 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలోకి దిగిన మైట్ వారియర్స్ జట్టు అద్భుతమైన ఆటతీరుతో కేవలం 6 వికెట్లు కోల్పోయి 73 పరుగులు సాధించి, 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ పోరులో మైట్ వారియర్స్ జట్టుకు చెందిన చెన్న అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. విజేతకు ధర్మవరం బీజేపీ నాయకులు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు.
ఈరోజుతో రౌండ్-టూ మ్యాచులు విజయవంతంగా ముగిశాయని నిర్వాహకులు తెలిపారు. రేపటి నుండి టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు మరింత ఉత్కంఠభరితంగా ప్రారంభం కానున్నాయని, ధర్మవరం క్రీడాభిమానులు ఈ పోటీలను ప్రత్యక్షంగా వీక్షించి జట్లను ఉత్సాహపరచాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు