Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరోగులకు సేవ చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది..

రోగులకు సేవ చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది..

- Advertisement -

కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు సేవ చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది అని కన్వీనర్ నామప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 380 మంది రోగులకు శ్రీ సత్య సాయి సేవ సమితి గాంధీ నగర్ వారి ఆధ్వర్యంలో ఆసుపత్రి వైద్యులు సిబ్బంది చేతుల మీదుగా భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ వెంకటస్వామి వ్యవహరించడం పట్ల సేవా సమితి వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి చేస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు