విశాలాంధ్ర-సంతకవిటి/రాజాం (విజయనగరం జిల్లా): సంతకవిటి మండలం మామిడిపల్లి పంచాయతీ మామిడిపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విభాగం మాస్టర్ ట్రైనర్ బి.పద్మ, యూనిట్ ఇన్చార్జి పాత్రుని వెంకటరమణ, గ్రామ సర్పంచులు, కొల్ల అమ్మాజీ నాయుడు మోడల్ మేఖర్ అన్నంనాయుడు, పంచాయతీ సెక్రెటరీ కోటీశ్వరరావు గ్రామ పెద్దలు రైతులు ఈ గ్రామసభలో పాల్గొనడం జరిగింది. గ్రామసభ ముఖ్య ఉద్దేశం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రైతులు నవధాన్యాలు విత్తనాలు 12 కేజీలు పప్పు దినుసులు, చిరుధాన్యాలు, పచ్చిరొట్ట విత్తనాలు, ఆకుకూరలు, కూరగాయలు ఒక ఎకరాకు 12 కేజీలు చొప్పున ఖరీఫ్ లో వేసుకుంటే 45 రోజుల తర్వాత ఓసారి కలుపుకోవాలి. వీటివలన నేల సారవంతం పెరుగుతుంది. పంటకు కావలసిన సూక్ష్మ స్థూల పోషకాలు లభిస్తుంది ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకుంటుంది. రైతులకు రసాయని వ్యవసాయానికి బదులు ప్రకృతి వ్యవసాయం చేయడం వలన పెట్టుబడులు తగ్గి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడంతో పాటు నేలతల ఆరోగ్యాన్ని కాపాడుకొని భవిష్యత్తు తరాల వారికి అందించడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులైన ఘనజీవమృతం, బీజమృతం, ద్రవ జీవమృతము, నియమాస్త్రము మొదలైనవి రైతులు పాటిస్తే పెట్టుబడులు తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది అని వివరించారు.