విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం రూరల్ సర్కిల్ ఆఫీసు నందు నాలుగు మండలాల పోలీస్ స్టేషన్లు అయిన రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస పోలీస్ స్టేషన్లో సిబ్బందితో గంజాయి కేసులు దర్యాప్తు సమయంలో పాటించవలసిన పద్ధతులు గురించి రాజాం ఏ.పి.పి విజయలక్ష్మి, రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర తగు సూచనలు సలహాలు ఇస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతకవిటి ఎస్సై.గోపాలరావు, రేగిడి ఆమదాలవలస ఎస్సై.లీలావతి,ఎక్సైజ్ ఎస్ఐ మాన్యుల్,! నాలుగు పోలీస్ స్టేషన్ల ఏఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.