Homeజిల్లాలుఅనంతపురంజిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా ఆయుధ పూజ

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా ఆయుధ పూజ

- Advertisement -

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : అనంతపురం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు ఘనంగా ఆయుధ పూజ జరిగింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అత్యంత భక్తి శ్రద్ధలతో జిల్లా ప్రజలు మరియు జిల్లా & రాష్ట్ర పోలీసులు సుఖఃశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ జిల్లా ఎస్పీ పి.జగదీష్ ప్రత్యేక పూజలు చేశారు. ఆనవాయితీ ప్రకారం పోలీసు ఆయుధాగారంలోని పోలీసులు దైనందిన విధుల్లో వినియోగించే అన్నిరకాల ఆయుధాలకు… మోటారు ట్రాన్సుపోర్ట్ విభాగంలోని వివిధ రకాల వాహనాలకు ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకూడదంటూ ప్రార్థిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడారు. దుర్గా మాత ఆశీస్సులతో జిల్లా ప్రజలు, పోలీసులు… ఇలా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించాలని… జిల్లా పోలీసులకు తమ దైనందిన విధులు, సేవల్లో విజయాలు చేకూరాలన్నారు. ఆయు:రారోగ్యాలు, అభివృద్ధి జరగాలన్నారు. ప్రజలతో మమేకమై పోలీసుశాఖ ప్రతిష్ట పెంపొందేలా పోలీసు విధులు ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈకార్యక్రమాలలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, అనంతపురం రూరల్ సబ్ డివిజన్ ఏఎస్పీ అశ్విన్ మణిదీప్, డీఎస్పీలు కరుణాకరరావు, నీలకంఠేశ్వరరెడ్డి (ఏ.ఆర్) డిపిఓ ఏ.ఓ రవిరాంనాయక్ , సి.ఐ లు క్రాంతికుమార్ , వలుబాష, ఆర్ ఐ లు మధు, పవన్ కుమార్ , పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు త్రిలోకనాథ్ , ఆర్ఎస్ఐ జాఫర్ , లక్ష్మినారాయణ, ఆర్ఎస్ఐ బాబ్జాన్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు