Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమూడవరోజు సజావుగా జరిగిన నామినేషన్ల ప్రక్రియ.. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య

మూడవరోజు సజావుగా జరిగిన నామినేషన్ల ప్రక్రియ.. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద, సంజయ్ నగర్ లోని బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద జరిగిన నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగిందని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి 11 నామినేషన్లు రావడం జరిగిందని తెలిపారు. ఇందులో టిడిపి పార్టీ 6 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఇద్దరూ, కాంగ్రెస్ పార్టీ ఒకరు, నవతరం పార్టీ ఒకరు, ఇండిపెండెంట్ ఒకరు వేయడం జరిగిందన్నారు. 48 వార్డు మెంబర్ పదవులకు దాఖలైన నామినేషన్లు; అదేవిధంగా పట్టణంలోని 48 వార్డుల్లో కౌన్సిలర్ పదవులకు 175 నామినేషన్లు రావడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందులో టిడిపి పార్టీ వారు 53 మంది, బిజెపి 43, ఇండిపెండెంట్ లు 34, వైయస్సార్సీపి 23, జనసేన 18, సిపిఐ మూడు, బి.ఎస్.పి ఒకటి, సిపిఐ మూడు దాఖలు చేయడం జరిగిందన్నారు. అక్టోబర్ నెల 16 నుండి 18 వరకు మూడు రోజులు పాటు మున్సిపల్ చైర్మన్ కు పంతొమ్మిది నామినేషన్లు వచ్చాయని, అదేవిధంగా వార్డు కౌన్సిలర్లుగా 355 నామినేషన్లు రావడం జరిగిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు