Homeఆంధ్రప్రదేశ్ఆయుష్ మాన్

ఆయుష్ మాన్

- Advertisement -

ఆయుష్ మాన్ మందిర్ లో సేవలు పై తనిఖీ 

విశాలాంధ్ర – సీతానగరం : ఆయుష్ మాన్ ఆరోగ్య మందిర్ లో ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలు పై తనిఖీ నిర్వహించడం జరిగింది అని మండల వైద్య అధికారి డాక్టర్ ఏ వి కే చైతన్య అన్నారు. మండలంలో ఇనగంటివారిపేట గ్రామంలో గల ఆయుష్ మాన్ ఆరోగ్య మందిర్ లో శనివారం నేషనల్ క్వాలిటీ అష్యు రెన్స్ స్టాండర్డ్స్ టీమ్ వర్చువల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పర్యవేక్షణ అధికారిని డాక్టర్ సుధా మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను నిర్మించిందని అన్నారు. ఈ మందిర్ ల ద్వారా 14 రకాల టెస్టులతో పాటు105 రకాల మందులు ఇక్కడ ఉచితంగా  అందుబాటులో ఉంచడం జరిగింది అని అన్నారు. కావున ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే వీటికి సంబంధిత దస్త్రాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక  వారం రోజులలో ఇనగంటివారిపేట ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి ఎన్ క్యూ ఏ ఎస్ నుండి దృవీకరణ పత్రం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యం శ్రీరామమూర్తి ,పంచాయతీ కార్యదర్శి విఠల్, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు