జిల్లాలో కొనసాగుతున్న ఇసుక దందా..
యథేచ్ఛగా డ్రెడ్జింగ్
కొవ్వూరు ఇసుక ర్యాంపులలో కొనసాగుతున్న వైకాపా నాయకుల హవా..
తెదేపా నాయకుల అండతోనే అంటున్న తెదేపా కార్యకర్తలు?
దండకుంటరేవు లో లారీలు పట్టివేత..
ఈ ర్యాంపు లు మాకొద్దు అంటున్న తెదేపా కార్యకర్తలు
విశాలాంధ్ర – కొవ్వూరు : మూడు నెలల విరామం తర్వాత జిల్లా వ్యాప్తంగా నదిలోంచి ఇసుక తీసే ఇసుక ర్యాంపులలో ఇసుకను తీసే కార్యక్రమానికి తాత్కాలికంగా తెరపడింది. దీనికి కారణం ఆగస్టు నెలలో మొదలైన వర్షాలు దాదాపు రెండు నెలలు వరుసగా పడటంతో రాంపుల వద్ద చిత్తడి చిత్తడిగా మారి లారీల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఆ సమయంలో ఇసుకాసురులు అవకాశాలను వదులుకోకుండా గోదావరి నది వెంబడి గట్లపై స్టాక్ పాయింట్ల నిర్వహణ పేరుపై కొండలను తలపించే విధంగా ఇసుక స్టాక్ ను ఏర్పాటు చేసి అడ్డు అదుపు లేకుండా విక్రయాలు జరిపారు. క్రమేపి వాతావరణం వాతావరణం అనుకూలించడంతో ఈనెల 15 దాటిన తర్వాత మరల నదిలోంచి పడవల ద్వారా ఇసుకను తీసే ర్యాంపులు తిరిగి ప్రారంభమయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా రాంపులలో వైకాపా నాయకుల హవా?
జిల్లా వ్యాప్తంగా వైకాపా నాయకుల హవా ఇంకా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విషయానికొస్తే కొవ్వూరు దండకుంటరేవులో ఒక వైకాపా నాయకుడు తన హవా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ నాయకుడు రాయలసీమ జిల్లాకు చెందినవాడని తెలుస్తోంది. వైకాపా ప్రభుత్వంఅధికారంలో ఉన్నప్పుడు ఇదే ర్యాంపు తో సహా పలు ర్యాపులలో తన హవా నడిపినట్లు చెబుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సదర నాయకుడు హవా కొనసాగిస్తున్నట్లు విశ్వసినీయ సమాచారం. ఇతడు దండకుంట రాంపులలో విసురుల తక్కువ ధరకు విక్రయిస్తూ, అనేక నిబంధనలను ఉల్లంఘిస్తూ తోటి ర్యాంపు నిర్వాహకులకు నష్టం కలిగిస్తున్నారని అధికార పార్టీకి చెందిన ర్యాంపు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నాయకుడు అధికార పార్టీ నాయకులను మంచి చేసుకుని ముడుపులు చెల్లిస్తూ తన హవాను కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అధికార పార్టీ వచ్చిన తర్వాత రాంపులు తీసుకుని నిర్వహిస్తున్న వారు వైకాపా నాయకుడు తీరు వల్ల తాము సైతం నష్టపోతున్నామని ఇలాగైతే రాంపులు నడపడం తమ వల్ల కాదని వాటిని వదులుకోవటం మంచి పని అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపద్యంలో శుక్రవారం దండకుంట ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా వెళుతున్న లారీలను, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అడ్రస్సులతో తెలంగాణ వెళుతున్న మార్కెట్ బండ్లను విజిలెన్స్ అండ్ మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలైనా ఇంకా వైకాపా నాయకుల హవా ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు.


