Friday, February 21, 2025
Homeజిల్లాలుఅనంతపురంబ్యాంకర్లకు ప్రతి మూడు నెలలకు కేటాయించిన లక్ష్యాలను 100% పూర్తి చేయాలి

బ్యాంకర్లకు ప్రతి మూడు నెలలకు కేటాయించిన లక్ష్యాలను 100% పూర్తి చేయాలి

లక్ష్యసాధనలో నిర్లక్ష్యం వహించరాదు
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర -అనంతపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంకర్లకు ప్రతి మూడు నెలలకు కేటాయించిన రుణ మంజూరు లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి , ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ లో ఉన్న డి.పి.ఆర్.సి భవనంలో మంగళవారం నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ మరియు జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో అనంతపురం ఎంపి తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంకర్లకు ప్రతి మూడు నెలలకు కేటాయించిన రుణమంజూరు లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలన్నారు. శిక్షణలో పాల్గొంటున్నవారికి శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికెట్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్టాండప్ ఇండియా పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి 39.34 శాతం మాత్రమే రుణాలు ఇవ్వడం జరిగిందని, కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా అర్హులైన లబ్ధిదారులకు ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ లను క్లెయిమ్ చేసుకునేందుకుగాను సంబంధిత శాఖలకు సంబంధించిన అధికృత అధికారి యొక్క వివరాలు తనకు అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎల్డీఎంకు సూచించారు. అర్హత గల పశుసంవర్ధక మరియు మత్స శాఖలకు చెందిన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని,ఇందుకు సంబంధించి కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఎల్జీఎం ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
అనంతపురం ఎంపీ అంబికాలక్ష్మీనారాయణ మాట్లాడుతూ… జిల్లాలోని రైతుల శ్రేయస్సు కోసం బ్యాంకుల పని చేయాలని, వారికి విరివిగా పంట రుణాలను అందించి తోడ్పాటు ఇవ్వాలని సూచించారు. సామాజిక బాధ్యత క్రింద జిల్లాలోని 51 గ్రామాల్లో ఒక మినరల్ ప్లాంట్ చొప్పున ఏర్పాటు చేయాలని జిల్లాలోని బ్యాంకర్లను కోరడం జరిగిందని, ఇందుకు ప్రతి బ్యాంకర్ ముందుకు వచ్చి ఆర్ ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం ఒక మినీ బస్సును కూడా అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు.
ఈ సమావేశంలో ఎల్.డి.ఎం నర్సింగ్ రావు, డిఆర్డిఏ పిడి ఈశ్వరయ్య, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, జిల్లా పరిశ్రమల శాఖ జెడ్ఎం శ్రీధర్, ఫిషరీష్ డిడి శ్రీనివాసనాయక్, మెప్మా పిడి విశ్వజ్యోతి, చేనేత,జౌళిశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసరెడ్డి,వివిధ బ్యాంక్ సీఈఓలు, మేనేజర్లు, బ్యాంకర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు