ఎగవేతదారులతో కుమ్మక్కై వసూళ్లను విస్మరిస్తున్నాయి
కేంద్రం, ఆర్బీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూదిల్లీ: ఇచ్చిన రుణాలు సక్రమంగా వసూలు చేయడం లేదని బ్యాంకులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణాలు ఇవ్వడంలో చూపిన శ్రద్ధ రికవరీలో చూపడం లేదని మండిపడింది. వసూళ్ల విషయంలో బ్యాంకుల తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ప్రజా ధనాన్ని, పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎంతో ఉదారంగా రుణాలుగా ఇస్తోన్న బ్యాంకులు వాటి వసూళ్లపై మాత్రం గట్టి చర్యలు తీసుకోకపోవడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో బ్యాంకులు, ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఏఆర్‌సీ)లు, రుణగ్రహీతల మధ్య లోతైన లాలూచీ వ్యవహారాలున్నాయంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వీ మోహన ధర్మాసనం ఆక్షేపించింది. ప్రజాసంక్షేమానికి ఉపయోగపడాల్సిన ప్రభుత్వ ధనం దుర్వినియోగమవుతోందన్న ఆందోళన వ్యక్తం చేసింది. రూ.1,537 కోట్ల బకాయిలను వసూలు చేయాల్సిన ప్రభుత్వ రంగ బ్యాంకులు కేవలం రూ.73.50 కోట్లకే రెండు ఏఆర్‌సీలతో పరిష్కారం కుదుర్చుకోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన వాజ్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌కు సమాధానమివ్వాలంటూ కేంద్రం, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇతరులకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. రుణ బకాయిల పరిష్కారం తీరు ఇదేనా అంటూ ఆక్షేపించింది. ‘పన్ను చెల్లింపుదారుల సొమ్మును, ప్రజల డబ్బును సేకరించి బాధ్యతారహితంగా వాటిని విడుదల చేయడం, రుణాలు ఇచ్చి, వాటి వసూలుకు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం మీ వ్యాపార విధానమైతే ఇది ఏ మాత్రం సమర్థనీయం కాదు’ అని ధర్మాసనం పేర్కొంది.
రుణగ్రహీతలతో బ్యాంకులు లాలూచీ
- Advertisement -
RELATED ARTICLES


