Homeజిల్లాలుఅనంతపురంకరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి...

కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి…

- Advertisement -

విశాలాంధ్ర–తాడిపత్రి: కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సోమవారం తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేసి కరువు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ప్రత్యేకంగా అనంతపురం జిల్లా తరచూ కరువు పరిస్థితులను ఎదుర్కొంటోందని, వర్షాభావం కారణంగా రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, జాతీయ కరువు విపత్తు జాబితాలో చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.కరువు ప్రభావిత ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కార్మికులను ఆదుకునేందుకు తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి నాగ రంగయ్య, పట్టణ సహాయ కార్యదర్శి శ్రీరాములు, రామంజి, సాలవేముల సూరి, రంగస్వామి, రత్నమయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు