విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) :రాజాం మున్సిపల్ కమిషనర్ జె.రామప్పలనాయుడు ఆదేశాలతో పట్టణ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం పలు వ్యాపార దుకాణాలను సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ సిబ్బందితో తనిఖీ చేశారు. ఈ దాడుల్లో పలు దుకాణాల్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేశారు. ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని, ప్రజలు ప్లాస్టిక్ కవర్లు వాడకుండా వాటి నిషేధానికి కృషి చేయాలని తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు అమ్మితే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులకు సానిటరీ ఇన్స్పెక్టర్ సి.హెచ్.హరిప్రసాద్ హెచ్చరించారు.