విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : వేగంగా వెళుతున్న వోల్వా బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని అందులో మంటలు వ్యాపించి 20కి పైగా సజీవదహనం అయిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళుతున్న డిడి 01 ఎన్ 9490 అను నెంబరు గల వోల్వా బస్సు కర్నూలు సిటీ దాటి చిన్న టేకూరు సమీపంలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొని సుమారు 25 అడుగుల మేరా ద్విచక్ర వాహనాన్ని లాక్కు వెళ్ళింది. . బస్సు ముందర బాగంలో మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణిస్తున్న 42 మందిలో సుమారు 20 మంది సురక్షితంగా బయట పడగా సుమారు 20 మంది సజీవదహనం అయినట్లు తెలుస్తుంది. తెల్లవారు జామున 3 నుండి 3.10 నిముషాల సమయంలో ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. సురక్షితంగా బయటపడ్డ 11 మంది కర్నూలు ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు గాఢనిద్రలో ఉండటం వల్ల మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్‌పాటిల్, డిఐజీ కోయ ప్రవీణ్, జేసీ నూరుల్ కమర్, కమీషనర్ విశ్వనాధ్‌లు హుటాహుటిన సంఘటనా స్థలం చేరుకుని బాధితులను వైద్యశాలకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికి 11 మృతదేహాలను వెలికి తీసి గుర్తించడం జరిగింది. సంఘటన విషయం తెలుసుకున్న రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు , మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధనరెడ్డి, ఫరూక్, ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డిలు సంఘటన విషయం తెలుసుకోగానే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపటి ్ట మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బస్సులో ఉన్న ఇరువురు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి హోంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి ప్రసాద్‌రెడ్డిలు సంఘటనా స్థలంకు వస్తున్నట్లు తెలుస్తుంది.
బారీ రోడ్డు ప్రమాదం20 మందికి పైగా సజీవదహనం
- Advertisement -
RELATED ARTICLES


