విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలోని ఉర్దూ పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పించాలని శనివారం సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి కి, జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ మాట్లాడుతూ ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలం చెందారని ఆరోపించారు. మద్యాహ్న భోజనం సమయంలో తాగునీటి వసతి సరిగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పాఠశాలకు మంచినీటి వసతి కల్పించాలని, అలాగే పాఠశాలకు ప్రహరిగోడ నిర్మాణం చేపట్టాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సర్ధాజ్ పటేల్, తిక్కన్న, డోలు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.