ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు ఈనెల 12 వరకు పెంచడం జరిగిందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12 వరకు దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందని, బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయగలమని తెలిపారు. ఈ గడువు బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు తో సహా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న యూనిట్లకు అనుమతి కలదని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అందజేసే ఆర్థిక చేయూతను వినియోగించుకునేలా లబ్ధిదారుల్లో చైతన్యం కలిగిస్తామని తక్షణమే యూనిట్లు మంజూరయ్యేలా చూస్తామని తెలిపారు. కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో ఆలస్యం చోటు చేసుకోకుండా ధర్మవరం తాసిల్దార్ కూడా సహకరిస్తారని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు ఈనెల 12 వరకు పెంపు
RELATED ARTICLES