Thursday, February 6, 2025
Home Blog Page 143

సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఆరోగ్యం విషమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరుతున్నారు. ఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక కాంక్లేవ్ లో పాల్గొని ఆయన హైదరాబాద్ కు బయల్దేరుతారు. మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకోనున్న చంద్రబాబు… శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా తన సోదరుడు చికిత్స పొందుతున్న ఏఐజీ ఆసుపత్రికి వెళ్తారు. వాస్తవానికి చంద్రబాబు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లి… ఎన్డీయే తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. కాసేపట్లో ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

18 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలందరికీ స్క్రీనింగ్ పరీక్షలు

0

విశాలాంధ్ర – అనంతపురం : రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా జిల్లాలోని పిల్లలందరికీ పుట్టినప్పటి నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారిలో ఉన్న వ్యాధులు, వైకల్యాలను పూర్తిగా తల నుండి కాలి వరకు స్క్రీనింగ్ చేసి తొలి దశలోనే వ్యాధులను గుర్తించి సేవలందించడం లక్ష్యంగా స్క్రీనింగ్ పరీక్షలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రోగ్రాం అధికారి డాక్టర్ జి నారాయణస్వామి పేర్కొన్నారు. ఈవిధానం ద్వారా ముందస్తుగా వ్యాధులను గుర్తించడం, అవసరమైన సంరక్షణ, చికిత్స, మద్దతు మరియు రెఫరల్ చికిత్సకు అనుసంధానించడం పై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు.
వీటిలో ముఖ్యంగా
1.పుట్టుకతో వచ్చే లోపాలు,
2.వ్యాధులు,
3.పోషకాహార, మరియు
4.అభివృద్ధి అలస్యం మొదలగు 44 రకాల తీవ్ర స్థాయిలో ఉన్న వ్యాధులను గుర్తించుట కొరకు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్మానాత్మకంగా అమలు చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది మరియు గుర్తించిన పిల్లలందరికీ అతపరమయిన స్క్రీనింగ్, మెడికల్ మరియు శస్త్రచికిత్సల ద్వారా సహకారం అందించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారన్నారు.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నివసించే 0-6 సంవత్సరాల వయస్సు గల 1,45,388 పిల్లలను 2302 అంగన్వాడి బడులలో, ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో ఉన్న 7 నుండి 16 సంవత్సరాల వయస్సుగల
మొత్తం 2,00,118 మంది
పిల్లలందరిని ఈ కార్యక్రమం ద్వారా సేవలందించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. ఈ సేవలు అనంతపురం జిల్లాలొని సుమారు 3.45506 మంది పిల్లలకు క్రమపద్ధతిలో స్క్రీనింగ్ చేస్తామన్నారు.
ఈ కార్యక్రమాన్ని డిఇఐసి మేనేజర్ డి. రజిత పర్యవేక్షణలో ఫాలో అప్ చేయబడుతుంది అని పేర్కొన్నారు.

హాస్టల్ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేసిన డాక్టర్ బషీర్

0

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని సాయి నగర్ లో గల స్పందన ఆసుపత్రి అధినేత డాక్టర్ బషీర్ 58వ జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణములోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు లోగల బీసీ హాస్టల్ బాలికలు, ఎస్సీ హాస్టల్ బాలికలు, కోర్ట్ రోడ్డు లో బాలసదన్, దుర్గా నగర్ హాస్టల్, ఎర్రగుంట బీసీ హాస్టల్, ఎస్బిఐ కాలనీ బీసీ హాస్టల్ లోని విద్యార్థినీ విద్యార్థులకు దాదాపు 450 దుప్పట్లను ఆసుపత్రి మేనేజర్ బాబా ఫక్రుద్దీన్, దిల్దార్ సిబ్బంది చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వార్డెన్లు, విద్యార్థినీ విద్యార్థులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా దంపతులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హాస్టల్ వార్డెన్లు మాట్లాడుతూ పట్టణంలో ఉన్నటువంటి స్పందన హాస్పిటల్ సేవా కార్యక్రమాలలో ముందంజలో ఉందని, ఇటీవల విజయవాడలో వరద బాధితులకు వివిధ రూపాలలో డాక్టర్ బషీర్ డాక్టర్ సోనియాల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేయడం సంతోషదాయకమన్నారు. అదేవిధంగా పట్టణంలో బిపి, షుగర్ పరీక్షలను నిర్వహిస్తూ, అందరికీ అవగాహన కల్పించడంలో మంచి గుర్తింపు కూడా పొంది, మంచి వైద్య చికిత్సలను అందించడంలో పట్టణంలోనే ముందంజలో ఉందని తెలిపారు. ఏది ఏమైనా డాక్టర్ బషీద్ దంపతులు విద్య, వైద్య, తదితర అంశాలను తమదైన శైలిలో మానవతా విలువలను పెంచుతూ, జిల్లా, పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క మన్ననలు పొందడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరు హాస్టల్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

సబ్ జైల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా జడ్జ్

విశాలాంధ్ర – పెనుకొండ : అనంతపురం జిల్లాలీగల్ సర్వీసెస్ అథారిటీ శివప్రసాద్ యాదవ్ శుక్రవారం పెనుకొండ సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేయడ మైనది .సబ్ జైలు యందు బ్యారెకులు,టాయిలెట్లు ,వంటగది ,స్టోర్ రూమ్, రికార్డులు మరియు ఖైదీలతో సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీలందరూ బయటకు వెళ్లిన తర్వాత సత్ప్రవర్తనతో మెలగాలని ఆయన సూచించారు ఈ కార్య క్రమంలో సబ్ జైల్ సిబ్బంది ప్యానల్ అడ్వకేట్ శరత్ బాబు ప్యారా లీగల్ వాలంటీర్ నర్సప్ప మరియు అనంతపురం కోర్టు సిబ్బంది మరియు పెనుకొండ లోక్ అదాలత్ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

దేవాలయాలలో కార్తీక పౌర్ణమి వేడుకలు

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ మండలం కొండంపల్లి గ్రామం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయం లో అభిషేకం మరియు ప్రత్యేక మైన పూజలు నిర్వహించిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ భర్త వెంకటేశ్వర రావు మరియు పట్టణంలోని ఐ ముక్తేశ్వర ఆలయంలోనూ మరియు శివాలయంలోనూ కోటి దీపాల అలంకరణ మరియు విశేష పూజలు నిర్వహించారు, చంద్రగిరి లోని శ్రీగిరి శక్తి పీఠం నందు మహేశ్వరి ఆలయం నందు కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు, స్థానిక నాయకులు, పాల్గొన్నారు.

స్కూల్ టీచర్స్ అసోసియేషన్ కు ఎన్నికైన ఉపాధ్యాయులకు సన్మానం

విశాలాంధ్ర -పెనుకొండ (శ్రీ సత్య సాయి జిల్లా) : స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కాడిశెట్టి శ్రీనివాసులు, ఎన్నికైన సందర్భంగా పెనుకొండ డివిజన్ ఉపాధ్యాయులు ఆయన నివాసంలో కలిసి శుక్రవారం సన్మానించి అభినందనలు తెలియజేశారు.అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన యం.వి.కృష్ణారెడ్డిని సన్మానించారు. పెనుకొండ వాసి రాష్ట్ర అధ్యక్షుడు కావడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, గత పిఆర్సీ,డిఎ బకాయిల చెల్లింపు, సిపియస్ రద్ధు వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేయాలని పిఆర్సీ ఆలస్యమవుతున్నందున ఐఆర్ ప్రకటించేలా ప్రాతినిధ్యం చేయాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్ రెడ్డి, జి.గోపాల్,అమీర్ వలి,ఆర్.చంద్రశేఖర్, సి.నరేష్ మార్,ఆనంద్,ఇర్ఫాన్,జి.హనుమంతరాయుడు,బాబు,యస్.రవికుమార్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు,

అటవీ శాఖ సిబ్బందికి అడవులు , జంతువులపై శిక్షణ కార్యక్రమం

విశాలాంధ్ర పెనుకొండ (శ్రీ సత్య సాయి జిల్లా) : అటవీ శాఖ సిబ్బందికి అడవులు జంతువులపై శిక్షణ కార్యక్రమం శుక్రవారం అటవీ శాఖ కార్యాలయం నందు నిర్వహించారు సిబ్బందికి, ఎంబిఎస్, టైప్స్ అప్లికేషన్, వినియోగంపై శ్రీ సత్యసాయి జిల్లా అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ కార్యక్రమము మరియు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, శ్రీ సత్యసాయి జిల్లా అటవీశాఖాధికారి చక్రపాణి , తెలిపారు, ముఖ్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది అటవీ స్థాయిలో తిరిగినప్పుడు అడవులను సంరక్షించుట మరియు అడవి జంతువులను గుర్తించుట వాటి పాదముద్రికలు, మరియు వెంట్రుకలు, వాటి యొక్క పిచ్చుకలు ద్వారా జంతువులను గుర్తించడం వాటిని సంరక్షించడం వాటిని ఉన్నతాధికారులకు తెలియజేయడానికి క్షేత్ర సిబ్బందికి అవగాహన కల్పించడానికి శ్రీశైలం బయో డైవర్సిటీ అధికారి ధనరాజ్ , పాల్గొని సిబ్బందికి శిక్షణ ఇచ్చారు, జంతువుల్ని ఎలా గుర్తించాలి, అనే వాటిపై ట్యాబ్ లో నమోదు చేయడం వంటి వాటిని శిక్షణ ద్వారా నేర్పించారు ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా నుంచి 55 మంది వరకు పాల్గొన్నట్లు చక్రపాణి తెలిపారు, ఈ కార్యక్రమంలోసబ్ డివిజనల్ అధికారి జిపి ఆనంద్ , మరియు వారి సిబ్బంది మరియు ,కదిరి ,బుక్కపట్నం, పెను కొండ అటువీ క్షేత్ర అధికారులు గుర్రప్ప ,యామిని సరస్వతి, శ్రీనివాస్ రెడ్డి ,మరియు డిప్యూటీ అటవీ క్షేత్ర అధికారులు శివరాం , హుసే నప్ప మరియు జిల్లా అటవీశాఖ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జోరుగా తెదేపా సభ్యత్వ నమోదు

విశాలాంధ్ర పెనుకొండ ( శ్రీ సత్య సాయి జిల్లా) : పెనుకొండ పట్టణంలోని కొత్త పేట, కఠికరవీధి కాలనీలలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జోరుగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెదేపా పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్ నేతృత్వంలో కార్యకర్తలతో కలిసి నిర్వహించారు, తెదేపా సభ్యత నమోదును ఎక్కువగా చేయించాలనిబిసి సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ సూచనల మేరకు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇంటింటా టిడిపి సభ్యత్వ నమోదుచేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో షౌకత్ ,కఠికర ఖన్నా , సుబ్ర హ్మణ్యం, గోపి ,చెండ్రాయుడు, లక్ష్మిదేవమ్మ , సతీష్ ,సాయి రమేష్, దాదు, సలీం, సభ్యత్వ నమోదు వాలంటీర్లు, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జోరుగా తెదేపా సభ్యత్వ నమోదు

విశాలాంధ్ర పెనుకొండ (శ్రీ సత్య సాయి జిల్లా) : పెనుకొండ పట్టణంలోని కొత్త పేట, కఠికరవీధి కాలనీలలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జోరుగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెదేపా పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్ నేతృత్వంలో కార్యకర్తలతో కలిసి నిర్వహించారు, తెదేపా సభ్యత నమోదును ఎక్కువగా చేయించాలనిబిసి సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ సూచనల మేరకు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇంటింటా టిడిపి సభ్యత్వ నమోదుచేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో షౌకత్ ,కఠికర ఖన్నా , సుబ్ర హ్మణ్యం, గోపి ,చెండ్రాయుడు, లక్ష్మిదేవమ్మ , సతీష్ ,సాయి రమేష్, దాదు, సలీం, సభ్యత్వ నమోదు వాలంటీర్లు, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆశ వర్కర్స్ సమస్యలపై జరిగే ధర్నాను విజయవంతం చేయండి

విశాలాంధ్ర -పెనుకొండ (శ్రీ సత్య సాయి జిల్లా) : ఆశ వర్కర్స్ కు కనీస వేతనం 26, 000వేలు రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించాలని 18వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీపిలుపు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, మాట్లాడుతూ ఆశ వర్కర్స్ సమస్యలు పరిష్కారం కోసం ఫిబ్రవరి 8వ తేదీన చలో విజయవాడ, కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆనాటి వైసీపీ ప్రభుత్వం స్పందించి ఫిబ్రవరి 9వ తేదీన రాష్ట్ర నాయకత్వంతో అధికారులు చర్చలు జరపడం జరిగింది ఆ సందర్భంగా కుదిరిన ఒప్పందాలకు జీవోలు సర్కులర్లు ఇవ్వాలని నూతన కమిటీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కి అనేక రూపాలలో వినతి పత్రాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు ,ఆశ వర్కర్స్ కు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని సాధారణ మెటర్నటీ లీవులు ఇవ్వాలని రాజకీయ అధికారులు వేధింపులు ఆపాలని ఆశలకు సంబంధం లేని పనులు చేపించకూడదని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ,ఇవ్వాలని గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 18వ తేదీన సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకురాలు పుల్లమ్మ, సుమంగళి,రాజేశ్వరి, అలివేలమ్మ, తులసి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.