Friday, January 10, 2025
Home Blog Page 18

4న నిర్వహించబడే సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి..

తొగట వీర క్షత్రియ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శివానగర్లో గల శివాలయ ఆవరణములో ఈనెల 4వ తేదీ శనివారం ఉదయం నిర్వహించబడే”చేనేత కులాల ఆత్మీయ బంధువు-కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్”ను సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తోకటవీర క్షత్రియ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు సంకారపు జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలిత 2025వ సంవత్సరపు శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు, చేనేత కార్మికులకు, చేనేత కులాల వారికి తెలిపారు. మన ధర్మవరంలో ఏడు చేనేత కులాల సోదర, సోదరీమణులు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్లో 70 శాతము చేనేత కులాలకు సంబంధించిన వారు ఉన్నారని తెలిపారు. నేడు కదిరిలో అత్యధికంగా మన చేనేత కుల బాంధవుడు కదిరిలో ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలవడం ఎంతో శుభదాయకమని, అంతేకాకుండా కదిరి ప్రజల మన్ననలు పొందిన మహా వ్యక్తి అని తెలిపారు. అటువంటి వ్యక్తికి మన ధర్మవరం నియోజకవర్గ తరఫున ప్రేమ, అభిమానం, బాధ్యతగా గుర్తించి ఈ నెల 4వ తేదీన కందికుంట ప్రసాద్కు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఐక్యమత్యంతో చేనేత కులాలు ముందుకు వెళ్లినప్పుడే, భావితరాలకు మనం చేయూత ఇచ్చిన వాళ్ళము అవుతామని తెలిపారు. ఈ ఐక్యమత్యంతోనే మన చేనేత కులాల ఉనికిని చాటుగలుగుతామని తెలిపారు. ఐక్యమత్యంతో వేలాది సంఖ్యలో చేనేత కులాలకు చెందిన వారు ఈ సభకు హాజరైనప్పుడే, సభకు నాంది అవుతుందని తెలిపారు.”రండి-కదిలిరండి”అన్న నినాదంతో మనము ముందుకు వెళ్లాలని తెలిపారు. రేపటి భవిష్యత్తుకు బంగారబాటకు ఈ సన్మాన సభ శ్రీకారం చుడుతుందని తెలిపారు. మన చేనేత కులాల వివిధ సమస్యలను పోరాడే అవకాశం కందికుంట ప్రసాదు ద్వారా తప్పక నెరవేరుతుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

కవి సోమన్న పుస్తకావిష్కరణ

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న రచించిన 61వ పుస్తకం “చిరు దివ్వెలు” పుస్తకావిష్కరణ బుధవారం హైదరాబాద్ లోని తాజ్ మహల్ హోటల్, ఘనంగా ఆవిష్కరించారు.మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ ఆంగ్ల నూతన సంవత్సరం-2025 సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనం మరియు పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం కార్యక్రమంలో సోమన్న రచించిన “చిరు దివ్వెలు” పుస్తకాన్నిముఖ్య అతిథి పద్మశ్రీ శ్రీ డా.కొలకలూరి ఇనాక్,విశ్రాంత భూగర్భ గనుల శాఖ అధికారి శ్రీ డా.వి.డి.రాజగోపాల్,కళాపోషకులు విశ్రాంత అటవీశాఖ అధికారి శ్రీ ఎ. ఎల్.కృష్ణారెడ్డి,కళారత్న శ్రీ డా.బిక్కి కృష్ణా,శ్రీడా.జె.విద్యాధర్, తె. ర.సం. అధ్యక్షులు శ్రీ నాళేశ్వరం శంకరం,గజల్ క్వీన్ శ్రీమతి వాసిరెడ్డి మల్లీశ్వరి, సినీ గీత రచయిత రి సాదనాల వేంకట స్వామి నాయుడు తదితర ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించారు . అనంతరం ఈ పుస్తకాన్ని శ్రీ ఎ.ఎల్.కృష్ణారెడ్డికి అంకితమిచ్చారు.దాదాపు 6 వసంతాల కాల వ్యవధిలో 61 పుస్తకాలు రచించి,పలు చోట్ల వాటిని ఆవిష్కరించిన గద్వాల సోమన్న అవిరళ కృషిని ప్రశంసిస్తూ సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాయకుడు డా. అరవా రవీంద్రబాబు,డప్పు కళాకారుడు కేశవయ్య, ఉపాధ్యాయులు ఎ. నాగేశ్వరరావు,కొప్పుల ప్రసాద్, కవులు, సాహితీమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

నౌలేకల్ లో కొత్త సంవత్సర వేడుకలు

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పల్లవి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గ్రామ ఉపసర్పంచ్ హనుమప్ప ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు గ్రామ సర్పంచ్ పల్లవి నరేష్ కుమార్ కు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

బిజెపి పట్టణ, రూరల్ నూతన అధ్యక్షులు ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం;; బిజెపి పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా స్థానిక బిజెపి కార్యాలయంలో ధర్మవరం పట్టణ, రూరల్ మండల అధ్యక్షులు ఎన్నిక కోసం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పట్టణ పోలింగ్ బూత్ అధ్యక్షులు పార్టీ నాయకులు పాల్గొని, అనంతరం బిజెపి ధర్మవరం పట్టణ అధ్యక్షుడిగా జింకా చంద్రశేఖర్, రూరల్ అధ్యక్షుడిగా సాకే చంద్రశేఖర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన వారు మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని తెలియజేశారు. తమ ఎన్నికల కోసం సహకరించిన మంత్రి సత్య కుమార్కు, కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబుకు, జిల్లా అధ్యక్షులు శేఖర్ కు, అంబటి సతీష్ కు, జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబులేసుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూండా పుల్లయ్య, డోలా రాజారెడ్డి, శ్యామ్ రావు, గిర్రాజు నగేష్, భక్తవత్సలం, నాగభూషణ, నవీన్ కుమార్, మహేష్, ప్రజాపతి ,రాయుడు, రామాంజనేయులు ,మంజుల ,మహాలక్ష్మి, రాధమ్మ, పోలింగ్ బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సజావుగా జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం..

మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములో పెన్షన్ పంపిణీ కార్యక్రమం సజావుగా నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, పెన్షన్ పంపిణీ తీరును వారు పరిశీలించారు. అనంతరం నేరుగా పెన్షన్ దారులతో మాట్లాడి, ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరిగిందని వారు ప్రజలతో తెలియజేశారు. పెన్షన్ పంపిణీ చేసే అధికారులకు ఎటువంటి డబ్బు ఇవ్వరాదని, అలా ఎక్కడైనా జరిగితే నా దృష్టికి తీసుకొని వస్తే చర్యలు గైకొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ విజయభాస్కర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించిన వన్టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో చదువుతున్న భార్గవి అనే విద్యార్థినికి, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేనందున, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ నాగేంద్రప్రసాద్ తన వంతుగా రూ.4,000 సహాయాన్ని అందించారు. ఈ పైకమును డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ముషలి రెడ్డికి అందజేశారు. అనంతరం ఆ విద్యార్థిని సిఐకు కృతజ్ఞతలు తెలియజేశారు.

విద్యుత్ మీటర్స్ లీడర్స్ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు గైకొనండి

ఏఐటీయూసీ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని విద్యుత్ శాఖ ఏడికి విద్యుత్ మీటర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ నాయకులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, నాయకులు రమణ, బాబావలి, జగదీష్ కుమార్, బాలశివలు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒకటే విస్కీమ్లో రెండు పనులు చేయడం వల్ల చెడ్డ విరుద్ధమని తెలిపారు. అదేవిధంగా సబ్ స్టేషన్ ఆపరేటర్ గా పనిచేస్తూ మీటర్ రీడింగ్ తీస్తున్న ముగ్గురు వ్యక్తులకు మీటర్ రీడింగ్ నుంచి తీసివేయాలని వారు కోరారు. తీసివేయకపోతే జనవరి 5న మీటర్ రీడర్స్ అందరూ కలిసి సమ్మెకు సిద్ధం కావాలని తెలిపారు. విద్యుత్ మీటర్ రీడర్స్ పని దినాలను పెంచాలని, ఏస్కో అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు తెలిపారు.

ఆర్ డి టి లీగ్ మ్యాచ్ లో రన్నర్స్ గా కొత్తపేట బాలికల పాఠశాల విద్యార్థినిలు


విశాలాంధ్ర ధర్మవరం; అనంతపురంలో నగరంలోని ఆర్ డి టి మైదానంలో జరిగిన క్రికెట్,కబడ్డీ పోటీల్లో శ్రీ సత్య సాయి జిల్లా కొత్తపేట లోగల మునిసిపల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలు చక్కటి ప్రతిభ కనబరిచారు. ఈ క్రీడల్లో క్రికెట్ లో,కబడ్డీ లో రన్నర్స్ గా పాఠశాల విద్యార్థినియులు నిలిచారు. క్రికెట్ లో బృందంలో,హస్మిత, దిని,సుకన్య,హేమలత,పల్లవి,ప్రణిత,నవ్య,సహస్ర,గయిని,సురేఖ,ప్రత్యూష,లహరి అదేవిధంగా కబడ్డీ లో పాల్గొన్న విద్యార్థినీలు నవ్య,హాస్మిత, జోష్ణ, హిమబిందు,చంద్రిక, సాయి జ్యోతి,భువన సాయి,బృంద, మానస వీరు అంత కబడ్డీ లిగ్ లో పాల్గొనీ రన్నర్స్ గా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం. మేరీ వరకుమారి ఆనందం వ్యక్తం చేస్తూ తదుపరి ఆర్ డి టి లో జరిగే మ్యాచ్ లో మా పాఠశాల విద్యార్థినిలు గెలుపుబాటలో నిలవాలని వారిని ఆశీర్వదించారు. అదేవిధంగా పిఈటీ అశ్వనిని అభినందించారు. రన్నర్స్ గెలిచిన విద్యార్థినిలకు పాఠశాల ఉపాధ్యాయ బృందం, హెచ్ఎం, పి ఈ టి, తల్లిదండ్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

మానవ హక్కులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం .. వాల్మీకి నరేష్, చంద్రమౌళి

విశాలాంధ్ర ధర్మవరం ; మానవ హక్కులు వాటి విధులకు తాము అండగా ఉంటామని వాల్మీకి నరేష్, చంద్రబాబుని తెలిపారు. ఈ సందర్భంగా వాల్మీకి నరేష్ ఏసీబీఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ సెల్, చంద్రమౌళి ఏసీబీఐ స్టేట్ సెక్రెటరీ క్రైమ్ ఇన్ఫర్మేషన్ సెల్ ఎంపికై ఏసీబీఐ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ హెచ్ ఎం డి ముజాహిద్ నుంచి అనంతపూర్ లోని సెంట్రల్ ఆఫీస్ లో నియామక పత్రాలు,ఐడి కార్డును అందుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి, ఇంతటి బాధ్యతను అప్పగించినందుకు మా విధుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని వారు తెలిపారు. తమ ఎంపికకు సహకరించిన కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ హెచ్ ఎం డి ముజాహిద్ , డాక్టర్ షేక్ పరాష్ షోయబ్ రహ్మాన్ , డాక్టర్ షేక్ సుహేల్ , డాక్టర్ ప్రశాంతి చౌదరి, అడ్వకేట్ డాక్టర్ జూలూరు సుమలత ఏసీబీఐ సభ్యులకు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఘనంగా జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్. ఇన్చార్జ్ హెడ్మాస్టర్ రఫీక్

విశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను నిర్వహించడం జరిగిందని ఇంచార్జ్ హెడ్మాస్టర్ రఫీక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఈఓ ఆదేశాల మేరకు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగిందని, ఈ ఎగ్జిబిషన్లో పట్టణము మండలములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుండి 41 ప్రదర్శనలను ఉపాధ్యాయుల సహకారంతో ప్రదర్శించడం జరిగిందన్నారు. ఈ ప్రదర్శనలో ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్ నుండి ఒకటి గ్రూపు ప్రాజెక్ట్ నుండి మరొకటి టీచర్ ప్రొజెక్ట్స్ నుండి ఒకటి చొప్పున జూరి మెంబర్స్ జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. మంచి ప్రతిభ కనబరిచిన ప్రదర్శనలో ఇండివిడ్యువల్ సైన్స్ ప్రాజెక్ట్ లో జి. ప్రణీత్-బిఎస్సార్ బాయ్స్ హై స్కూల్- ధర్మవరం, గ్రూప్ లెవెల్ సైన్స్ ప్రాజెక్ట్ నుండి ఎస్. యాస్మిన్, జిబి. పూజా మయి-కేజీబీవీ మోటుమర్ల ధర్మవరం, టీచర్ ప్రాజెక్ట్స్ నుండి ఎన్ రాజేంద్ర ప్రసాద్-జడ్.పి.హెచ్.ఎస్ దర్శనమల అను వీరు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఎన్నికైన వారందరికీ ఇన్చార్జి అత్యంత పాటు తోటి ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రధానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్, ప్రసాద్, రంగయ్య, రామకృష్ణ, హరికృష్ణ ,నాగేంద్ర, లీలావతి, నాగరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.