శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్య రావు
విశాలాంధ్ర అనంతపురం : ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులకు జాన్సన్ అండ్ జాన్సన్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యం తో ఎండోస్కోపీ,లాప్రోస్కోప్ సర్జరీ ల పైన శిక్షణా కార్యక్రమాన్ని 2 కోట్ల విలువైన బస్ లో ఏర్పాటు చేసారు.ఈ బస్ లో 2 రోజుల పాటు వైద్య విద్యార్థులు శిక్షణ తీసుకోనున్నారు.ఈ సందర్భం గా ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు మాట్లాడుతూ… వైద్య విద్యార్థులు ఇలాంటి నూతన వైద్య చికిత్సల పైన అవగాహన కలిగి ఉండడం చాల అవసరం అని,సులభ తరం గా రోగుల కు సర్జరీ నిర్వహించవచ్చు అని తెలిపారు.ఈ అవకాశాన్ని అందరూ పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉపయోగించుకుని నాణ్యమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి వచ్చిన శిక్షకులు హాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శిక్షణ పర్యవేక్షకులు ఆచార్య డాక్టర్ ఆత్మరాం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ తెలుగు మధు,ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ శంకర్,అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ ఉమా మహేశ్వర రావు,ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు,పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పిజి వైద్య విద్యార్థులకు ఎండోస్కోపీ సర్జరీ ల పైన శిక్షణ
పురంలో వైసీపీని నడిపే సమర్ధుడు , ఎవరు?
నవీన్ నిశ్చల్ కు మళ్లీ పార్టీ పగ్గాలు రానున్నాయా..?
నవీన్ కావాలంటూ క్యాడర్ కోరుకుంటుందా….?
విశాలాంధ్ర : చిలమత్తూరు : హిందూపురం నియోజకవర్గంలో వైసీపీని నడిపే సమర్ధుడు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి గత 40 ఏళ్లుగా ఇక్కడ టిడిపి తప్ప మరో పార్టీ జెండా ఎగిరింది లేదు. వరస ఓటములతో కాంగ్రెస్, వైసిపి ఇతర పార్టీల నుండి పోటీ చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు. వరుసగా మూడుసార్లు ఓటమిని మూట కట్టుకున్న వైసీపీ సీనియర్ నాయకుడు నవీన్ నిశ్చల్ మాత్రం తనదైన స్టైల్ లో రాజకీయం నడుపుతున్నారు. పార్టీలో ఉన్న వెన్నుపోటు దారుల నుండి వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నవీన్ ఇప్పటికీ ఒక్కసారైనా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని పట్టు వీడని విక్రమార్కుడిలా పోరాటం చేస్తున్నాడు. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తొలిసారిగా టికెట్ సాధించుకొని టిడిపి అభ్యర్థి రంగనాయకులపై ఓటమిపాలయ్యారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా టిడిపి అభ్యర్థి అబ్దుల్ గని పై పోటీ చేసి కేవలం 3600 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు నవీన్ . అప్పట్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా సినీ నటుడు బాలకృష్ణపై నవీన్ నిశ్చల్ ను బరిలోకి దింపింది అధిష్టానం. బాలకృష్ణకు గట్టి పోటీ ఇచ్చి 14 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు నవీన్. 2019లో బాలకృష్ణ దూకుడుకు కళ్లెం వేయాలని నవీన్ తన కేడర్ ను సిద్ధం చేసుకుంటే వైసిపి అధిష్టానం ఆయనకు టికెట్ నో చెప్పింది. ఎక్కడో మాజీ ఐపీఎస్ గా ఉన్న ఇక్బాల్ కు టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది వైసిపి. 2024 లో నైనా తనకు టికెట్ వస్తుందని ఆశించిన నవీన్ కు నిరాశే ఎదురయింది. బెంగళూరులో నివాసం ఉంటున్న దీపికా అనే మహిళా అభ్యర్థిని అనూహ్యంగా రాజకీయ తెరమీదకి తీసుకొచ్చి ఆమెకు టికెట్ ఇచ్చేసింది వైసిపి అధిష్టానం. మహిళా అభ్యర్థి అనే కనీస సెంటిమెంట్ కూడా లేకుండా బాలకృష్ణ మరింత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారు, హిందూపురం ఓటర్లు. పార్టీ అధిష్టానం నుండి ఎంత ఎదురుగాలి వేసినప్పటికీ పార్టీని వీడకుండా తన క్యాడర్ను చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారు నవీన్ నిశ్చల్. ఎమ్మెల్యే బాలకృష్ణపై పోటీ పడాలంటే అంత ఈజీ కాదు అంటున్నారు లోకల్ రాజకీయ విశ్లేషకులు. మరి బాలకృష్ణకు దీటైన వ్యక్తి వైసీపీలో ఎవరు ఉంటారన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. వైసిపి అధిష్టానం సీరియస్ గా తీసుకుని బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న నవీన్ కు ఇంచార్జ్ పదవి బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ గా ప్రచారంలోకి వచ్చింది. మూడుసార్లు ఓడిపోయి రెండుసార్లు టికెట్ లేకపోయినా అలాంటి నాయకుడికి వైసిపి ప్రాధాన్యత కల్పిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హిందూపురంలో వైసిపి బలోపేతం కావాలంటే మంచి
మాస్ ఫాలోయింగ్ ఉన్న నవీన్ నిశ్చల్ లాంటి నాయకుడు అవసరమని పలువురు రాజకీయ విశ్లేషకులు మేధావులు సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు. వైసిపి అధిష్టానం ఎటువైపు అడుగులేస్తుందో వేచి చూడాల్సిందే
ప్రభుత్వ వ్యవసాయ భూమిలో 12అడుగులు రస్తా ఉండాల్సిందే..
-రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ కేశవనాయుడు
విశాలాంధ్ర-రాప్తాడు : గ్రామాల్లో ప్రభుత్వ ఆసైన్మెంట్ వ్యవసాయ భూమిలో ఇతర రైతులకు రస్తా లేదు అని చెప్పే అధికారం ఏ రైతుకూ లేదని 12 అడుగుల రోడ్డు వదలాల్సిందేనని ఆనంతపురం రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ (ఆర్డీఓ) గుత్తా కేశవనాయుడు అన్నారు. హంపాపురం గ్రామంలో తహశీల్దార్ పి.విజయకుమారి ఆధ్వర్యంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆర్డీఓ హాజరై రైతులు, ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సమస్యలను విన్నారు. 2006 నుంచి తన భూమి ఆక్రమణలో ఉందని తనకు ఇప్పించాలని కోరారు. చుక్కల భూమిని 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రైతులు తన అనుభవంలో ఉన్నట్లు ఆర్.హెచ్. కాపీ, మ్యానువల్ ఈసీ, ఆన్లైన్ ఈసీ, లింక్ డాక్యుమెంట్లు చూపించాలన్నారు. తన భార్య సాగు చేసుకుంటున్న భూమికి అసైన్మెంట్ డి.పట్టా ఇస్తామని రెవెన్యూ అధికారులు ఏడాది క్రితం వివరాలు సేకరించి పట్టా ఇప్పటికీ ఇవ్వలేదని ఓ రైతు ఆర్డీఓను కోరగా దీనిపై తగు చర్యలు తీసుకోవాలని తహశీల్దారును ఆదేశించారు. రెవెన్యూ అధికారులు వారికి కేటాయించిన గ్రామాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సర్వే రామాంజనేయులు, ఆర్ఐ కరుణాకర్, వీఆర్ఓ శిరీష, ఎంపీటీసీ మోదుపల్లి రవి, గోనుగుంట్ల జయప్ప, ఫీల్డ్ అసిస్టెంట్ మధు, సోంభాస్కర్, ప్రతాప్, ధనలక్ష్మి, సీతారాం, యోగేంద్ర, డీలర్ వెంకీ, సర్వేయర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల భూములను కాజేయడానికి ఆదాని , కార్పొరేట్ల కుట్ర
… సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్
విశాలాంధ్ర -అనంతపురం : చిన్న, సన్న కారు రైతుల భూములను కాజేయడానికి సోలార్,గాలిమర్ల ఏర్పాటు పేరుతో ఆదాని కార్పొరేట్ దళారులు రైతులకు ఎకరానికి రూ 30 వేలు ఇచ్చి ,20 సం అగ్రిమెంట్ చేసుకుంటామని , రైతులను మభ్యపెడుతున్నారని, ఈ విషయంపై రైతులు జాగ్రత్త వహించాలని , సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ కోరారు. శనివారం స్థానిక సిపిఐ పార్టీ ప్రధాన కార్యాలయంలో సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి. మల్లికార్జున అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్, జిల్లా కార్యదర్శి సి జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శి పి. నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ… భూములను కార్పొరేట్ రంగానికి 20 సం లీజు రాసిన తర్వాత వారు ఆ పత్రాలను బ్యాంకులో రుణాలు తీసుకొని సోలార్,గాలిమరలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు.అనంత,సత్యసాయి, కర్నూలు జిల్లాల్లో ప్రైవేట్ కంపెనీ లో దళారులు ప్రవేశించారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్, గాలిమర్లకు 50 శాతం రాయితీకూడ ఇస్తోందన్నారు. అనంత జిల్లా లోహార్టికల్చర్ హబ్బును ముందుకు తీసుకుపోవడానికి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసి కార్గో విమానాలు ద్వారా పండించిన పండ్లను ఇతర రాష్ట్రాలు తీసుకోపోవడానికి కార్యాచరణ కూడ చేపడుతోందన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు అవుతుందని తద్వారా 3860 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. ఈ విధంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, కావున ఈ దశలో రైతులు భూములు కోల్పోవద్దని కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీలకు వ్యవసాయ భూములు ఇవ్వొద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా హంద్రీనీవా రెండో దశ కాంక్రీట్ లైనింగు పనులు చేయడానికి నిధులు మంజూరు చేసిందన్నారు. దీనివలన భూగర్భ జలాలు అడుగంటి పోతాయని, వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటాయని, కావున తక్షణమే రైతు సంఘాలతో రాజకీయ నాయకులతొ,జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అఖిలపక్షం వేసి చర్చించాలన్నారు. రైతు సంఘాలు నాయకుల సలహాలు తీసుకోవాలని కలెక్టర్కు వ్యవసాయ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను.విద్యుత్ చార్జీలపై వైయస్సార్ పార్టీ ధర్నా చేయడం పట్ల వారికి నైతికత లేదన్నారు. గత వైయస్సార్ ప్రభుత్వంలో నే విద్యుత్ చార్జీలు తొమ్మిది సార్లు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉందని, జగన్ ప్రభుత్వంలోని 20 వేల కోట్లు విద్యుత్ చార్జీల భారాలను మోపడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. మరలా ఇప్పుడేమో ప్రభుత్వం మారిన తర్వాత దొంగే ,దొంగ అన్నట్లు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైయస్సార్ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది . మీరు చేసిన తప్పిదాలకు వైయస్సార్ పార్టీ
బే షరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మరోవైపు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని టిడిపి ప్రభుత్వం అధికారంలోకి లో రా కముందు హామీ ఇచ్చి , అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే విద్యుత్ ఛార్జీలు పెంచడం సరైనది కాదన్నారు. కావున తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి .ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సిపిఐ పార్టీ విద్యుత్ చార్జీలు తగ్గించేంతవరకు ఆందోళన చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ… కార్పొరేట్ వ్యవసాయం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తోందన్నారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చి 2021 డిసెంబర్ 9వ తేదీన ఉభయ సభలో రద్దుచేసి దేశ ప్రజలకు నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పడం జరిగిందన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా తో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి జాతీయ వ్యవసాయ మార్కెట్ నూతన చట్టాన్ని తీసుకొని వచ్చి అదే చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. జాతీయ వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని దలేవాల్ నిరాహార దీక్ష చేపట్టడంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందన్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు గురువారం ఆందోళన వ్యక్తం చేసింది అన్నారు. తక్షణమే జాతీయ వ్యవసాయ చట్టాలను రద్దుచేసి కిసాన్ సంయుక్త మూర్చతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి. మల్లికార్జున మాట్లాడుతూ… భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి సారవంతమైన భూములు అనంత జిల్లాలో ఉందన్నారు. ఇక్కడ దాదాపు 28 రకాల పండ్లు పండించుకునే విధంగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ భూములను అంతా కార్పొరేట్ రంగానికి అప్పజెప్పడానికి నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకొని రావడం జరిగిందన్నారు. ఈక్రాప్ నమోదు చేయడం ద్వారా ఏ రైతు తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఎక్కడైతే పంట నష్టం వస్తుందో అక్కడ కార్పొరేటర్ రంగానికి అప్పగించే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు. దీని ద్వారా ఆహార ఉత్పత్తులు తగ్గుతాయి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన పంటల బీమా, పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదన్నారు. ఈ విషయాలపై సిపిఐ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు . రైతు సదస్సు కార్యక్రమంలో భాగంగా అధికారులు అక్కడ ఉన్న పంట పొలాలను పరిశీలించి నష్టం జరిగిన చోట అంచనా వేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పెట్టిన పంట పండక నష్టం రావడంతో అనంత జిల్లాలోని సింహాద్రిపురం కు చెందిన ఒకే రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయం అని పేర్కొన్నారు. రైతుల సమస్య తీరేంతవరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం ఆందోళన చేపడతామన్నారు. సమావేశంలో సింగనమల నియోజకవర్గం కార్యదర్శి టి.నారాయణస్వామి, రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి పి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
విశాలాంధ్ర – పెద్దకడబూరు(కర్నూలు) : విద్యార్థులకు శాస్త్రీయమైన విజ్ఞానంతో, పాటు నాణ్యమైన విద్యనందించి ఉత్తమ అభ్యాసకులుగా ఉత్తమ,దేశ పౌరులుగా చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైసింగ్ నిధుల క్రింద 65 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న ల్యాబ్ రోటరీ బిల్డింగ్స్, లైబ్రరీ బిల్డింగ్స్ ఆటస్థల సామాగ్రి బిల్డింగ్స్ కు ఉపాధ్యాయ బృందం తో పాటు, విధ్యాకమిటీచేర్మేన్, గుమ్ముల స్వామిరాజు అధ్యక్షతన భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వేలాది మంది విద్యార్థులు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నారని తెలిపారు. వారి సంక్షేమానికై శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించి, ఉత్తమ ప్రయోజకులుగా చేయాలనే సత్సంకల్పంతో భారీ మొత్తంలో నిధులు విధ్యాశాఖకు కుటమి ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. విధ్యార్థులు ప్రభుత్వం అదించే అవకాశాలు సద్వినియోగం చేసుకొని బాగా చదువు కొని ప్రయోజకులై, గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీల నాయకులు డి మల్లికార్జున, జిల్లా ఎస్. సి. సెల్ నాయకులు మీసేవ ఆంజనేయులు, బొగ్గుల, నరసన్న, గుమ్ముల ఆశన్న,యం. ఆదాము ఇమ్మానుయేల్, బొగ్గుల తిక్కన్న, జి. బుడ్డన్న, జె. దేవసాయం, సుధాకర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో సోమన్న పుస్తకావిష్కరణలు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న రచించిన 59 “తారాజువ్వలు”మరియు 60 “రేపటి వెలుగులు” పుస్తకావిష్కరణలు 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు శనివారం విజయవాడలో కె. బి. యన్ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ తులసి రెడ్డి,అవనిగడ్డ శాసన సభ్యులు గౌ. శ్రీ డా.మండలి బుద్ధ ప్రసాద్,పద్మశ్రీ డా.కొలకలూరి ఇనాక్,నిర్వాహకులు శ్రీ డా.జి పూర్ణచందు, శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,సినీ గేయ రచయి శ్రీ భువనచంద్ర ప్రముఖుల చేతుల మీద ఘనంగా ఆవిష్కరించారు.అనంతరం ఈ పుస్తకాలు మండలి బుద్ధ ప్రసాద్ ,సాదనాల వేంకట స్వామి నాయుడులకు అంకితమిచ్చారు.రమారమి 6 వసంతాల కాల వ్యవధిలో 60 పుస్తకాలు రచించి,పలు చోట్ల వాటిని ఆవిష్కరించిన గద్వాల సోమన్న అవిరళ కృషిని ప్రశంసిస్తూ సత్కరించారు. ఈ కార్యక్రమంలో జి.సూర్యనారాయణ, పి.బాబుశ్రీ ,పత్తిపాటి రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
గోవాడ సుగర్సులో కార్మికులు కర్షకులు బకాయిలు చెల్లింపులకు హామీ ఇచ్చిన యాజమాన్యం …
విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : చోడవరం (గోవాడ) సహకార చక్కెర కర్మాగారం కార్మికులు కర్షకుల బకాయిలు చెల్లించేందుకు ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ వి. సన్యాసినాయుడు స్పష్టమైన హామీతో కార్మికులు కార్మికులు జరుపుతున్న ఆందోళనను శుక్రవారం విరమించారు. దీనిపై సుగర్స్ ఎంప్లాయిస్ మరియు కార్మికుల యూనియన్ అధ్యక్షుడు కె.భాస్కరరావు మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులకు సుమారు అయిదు కోట్ల రూపాయలు వరకు వేతన బకాయిలు ఉన్నాయని అన్నారు. కార్మికులు, సబ్జా రైతుల బకాయి చెల్లింపులు కోసం రెండు రోజులుగా ఫ్యాక్టరీ ఆవరణలో ఆందోళన చేపడుతున్నామని తెలిపారు. కార్మికులకు రావలసిన డి ఎ పాయింట్లు పెంపుదల, వేతన బకాయిలు పై చేస్తున్న నిరసన లకు శుక్రవారం ఎండి వి ఎస్ నాయుడు, వివిధ విభాగాల అధిపతులు హాజరై కార్మికుల సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ కి వివిధ వర్గాల నుండి రావలసిన బకాయిలు రాగానే రైతులకు, కార్మికులకు ప్రయారిటీ మీద చెల్లింపులు చేయడానికి హామీ ఇచ్చారన్నారు. 2024 సంవత్సరానికి పెరిగవలసిన డి.ఏ. పాయింట్లు మొత్తం నవంబర్ నెల జీతం లో కలిపి జనవరి నించి రావలసిన ఎరియర్స్ కలిపి చెల్లిస్తామని, సిబ్బందికి మరియు కాంట్రాక్టు సోదరులకు బకాయి ఉన్న ఓవర్ టైం బకాయిలు, రిటైర్ అయిన సోదరుల గ్రాడ్యూటీే బకాయిలు తొందరలో చెల్లిస్తామని, ఆందోళనలో పాల్గొన్న కార్మికులు అందరి సమక్షం లో హామీ ఇచ్చారని తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమం లో పాల్గొన్న కార్మిక నాయకులు రాపేటి జగన్నాథ రావు, బండి శ్రీను, ప్రకాష్, రమణ, టైగర్ అప్పారావు, నూకరాజు మరియు ఉద్యోగ కార్మిక సోదర, సోదరీమణులు అందరికీ పేరు పేరునా ధన్యవాదములు తెలియజేశారు.
కరెంటు చార్జీల పెంపుదలపై వైసీపీ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదం…
చల్లా శ్రీనివాసులు
సిపిఐ పార్టీ ముదిగుబ్బ మండల కార్యదర్శి
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ; రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల కరెంటు చార్జీలు పెంచిన నేపథ్యంలో వైసీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుండడం చాలా హాస్యాస్పదంగా ఉందని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు శుక్రవారం ముదిగుబ్బలో ఒక ప్రకటనలో వైసీపీ నాయకుల వ్యవహార శైలపై ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నప్పుడు గత ఐదేళ్ల కాలంలో 8 నుంచి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీ ప్రభుత్వ నాయకులు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆందోళన కార్యక్రమాలు చేయడం సబబుగా లేదని పేర్కొన్నారు, కాగా అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కూడా పూర్తి కాకనే కరెంట్ చార్జీలు పెంచిన ఎన్ డి ఏ ప్రభుత్వం మరోవైపు ఇది మా తప్పుకాదని వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాలు వలనే కరెంటు చార్జీలు పెరిగాయని చెబుతుండడం మరింత విడ్డూరంగా ఉందని ఆయన ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించారు,
ఏది ఏమైనా గతంలో వైసిపి నేడు ఎన్ డి ఏ ప్రభుత్వాలు రెండు తోడు దొంగల్లాగా వ్యవహరిస్తున్నారని, దొందు దొందే అన్న రీతిలో తరచూ కరెంటు చార్జీలు పెంచుతూ ఆర్థికంగా సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆరోపించారు, ఇది ఇలా ఉండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో మండల ప్రజలతో కలిసి త్వరలోనే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ముదిగుబ్బ విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని
ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మద్యం మత్తులో మేనల్లుడిని హత్య చేసిన మేనమామ
విశాలంద్ర – చోడవరం ( అనకాపల్లి జిల్లా) : చోడవరం పాత బస్టాండ్ సెంటర్లో మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో మేనమామ చేతిలో మేనల్లుడు హత్యకు గురయ్యాడు. దీనిపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం స్థానిక లక్ష్మమ్మ గుడి సమీపంలోని రెల్లి వీధిలో నివాసముంటున్న సోమాధుల ప్రేమ్ కుమార్ (27), అతని మేనమామ బంగారు దుర్గ చిత్తు కాగితాలు ఏరుకుంటూ, వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో మద్యం తాగుతూ ఉంటారు. డబ్బులు విషయంలో ఇద్దరూ శుక్రవారం ఉదయం గొడవపడ్డారని తెలిపారు. శుక్రవారం రాత్రి బాగా పొద్దు పోయాక పాత బస్టాండ్ సెంటర్లో ప్రేమ్ కుమార్ ఉన్నట్లు తెలుసుకున్న దుర్గ అక్కడికి చేరుకుని కర్రతో ప్రేమ్ కుమార్ ను గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు తల్లి విశాఖ ఆరిలోవ ప్రాంతంలో నివాసం ఉంటుందని అన్నారు. నిందితుడు దుర్గను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ సీఐ అప్పలరాజు తెలియజేశారు.
భారత దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్..
మన్మోహన్ సింగ్ గారి మరణం దేశానికి తీరని లోటు
ధర్మవరం నియోజకవర్గ స్వమన్వయకర్త నరేష్ యనమల
విశాలాంధ్ర ధర్మవరం; భారత ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించి, భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని, వారి మృతి జీర్ణించుకోలేని ఘటన అని, కాంగ్రెస్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ స్వమన్వయకర్త నరేష్ యనమల అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆకస్మిక మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగిందన్నారు. ఈ దేశానికి రెండు సార్లు ప్రధానమంత్రి గా ఆర్బీఐ గవర్నర్ గా , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, కేంద్ర ఆర్థిక మంత్రిగా భారతదేశం ఆర్థికంగా నిలదుక్కోవటంలో, ప్రపంచంలోమూడవ ఆర్థిక శక్తిగా ఎదగడంలో మన్మోహన్ సింగ్ పాత్ర మరచిపోలేనిదని కొనియాడారు. ఈ దేశ ప్రధానిగా మూడు కోట్ల మంది రైతుల రుణమాఫీ ఒకే విడతలో చేసిన ఘనత మన్మోహన్ సింగ్ కే చెందుతుందని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టం తో పాటు దాదాపు 14 రకాల చట్టాలను సామాన్యులకు, పేద, బడుగు, బలహీన వర్గాలకు అందుబాటులోకి తీసుకొని వచ్చి చరిత్ర పుట్టలో నిలిచిపోయారని, ఆయన మృతి ఈ దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ తీరని లోటుగానే ఉంటుందని అన్నారు.