Saturday, May 10, 2025
Home Blog Page 351

రైతు కూలీ మృతితో అంతటా విషాదం

సంఘటన స్థలానికి చేరుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆర్డీవో మహేష్, ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్య కుమార్ యాదవ్ కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ బాబు

మృతి చెందిన రైతు కూలీ కుటుంబానికి సంతాపం తెలిపిన అధికారులు, ఎమ్మెల్యే సునీత
విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని కట్ట కింద పల్లి గ్రామంలో ఓ బావి వద్ద విద్యుత్ మోటార్ ను బయటికి తీసుకునే సమయంలో రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన దాసరి రామాంజనేయులు(43) అనే రైతు అకస్మాత్తుగా బావిలో పడి మృతి చెందాడు. వివరాలకు వెళితే మోటారు మరమ్మత్తు కోసం బావిలో దిగి ఊపిరాడక నీటిలో మునిగి పోయి మృతి చెందాడు. మృతునితోపాటు పలువురు కూలీలు కూడా కూలి పని నిమిత్తం ధర్మారం మండలం కట్టకిందపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలోకి వెళ్లారు. బావిలో పుష్కలంగా నీళ్లు ఉండటం వల్ల బావి అడుగుభాగాన పాడైపోయిన మోటార్ను పైకి లాగే ప్రయత్నం చేశా రు. బావి అడుగుభాగంలో ఉన్న మోటారుకు తాడు కట్టేందుకు నీళ్లలో మునిగాడు. అయితే బావిలో ముళ్ళపదలు ఎక్కువగా ఉండటంతో వాటిని తగులుకొని బయటకు రాలేక ఊపిరాడిక బావిలోనే మృతి చెందాడు. ఈ విషయాన్ని తోటి కూలీలు గ్రామస్తులకు సమాచారం అందించడంతో రూరల్ ఎస్సై శ్రీనివాసులు ఫైర్స్ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. వారి సహకారంతో బావిలో ఉన్న నీటిని తోడి ప్రయత్నం చేసి మృతుని కోసం గాలింపు చర్యలు చేపట్టిన రాత్రి వరకు దొరకలేదు. మృతదేహం కోసం పోలీసులు ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా ఎంత ప్రయత్నం చేసినా ఫలితం శూన్యమైంది. ఈ సమాచారాన్ని అందుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటు ఆర్డిఓ మహేష్, మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎన్డీఏ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు, బిజెపి నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన విషయాన్ని ఆరా తీశారు. మృతునికి భార్య తోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సంఘటన గ్రామాన్ని విషాదంలో ముంచేసింది.పరిటాల సునీత మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాన్ని ప్రభుత్వ మా అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలుపుతూ, ఆ కుటుంబానికి సంతాపం తెలిపారు.

వికాస తరంగిణి ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు

విశాలాంధ్ర. విజయనగరం జిల్లా. రాజాం.

వికాస్ తరంగణి ఆధ్వర్యంలో ,రాజాం నియోజకవర్గం పరిధిలో శ్రీరామాయణం చిత్రలేఖన పోటీలు విద్యార్థులకు నిర్వహించినది. విశ్వామిత్రుడు తలపెట్టిన యాగ సంరక్షణ అనంతరము రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఆజ్ఞ గురించి ఎదురుచూస్తూ నమస్కరి స్తున్న దృశ్యాన్ని విద్యార్థులు చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మన రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర విద్యార్థుల ఉద్దేశించి రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుని గురువుగా ఎలా గౌరవించారు అన్న విషయాన్ని, అన్నదమ్ముల అనుబంధాన్ని ,భార్యాభర్తల సంబంధాన్ని విద్యార్థులకు వివరించారు. వారాడ వంశీకృష్ణ మాట్లాడుతూ ఈ దశ నుండి రామాయణం చరిత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించడం గొప్ప విశేషమని ఇది వినియోగించుకున్న విద్యార్థులకు పాఠశాల యాజమాన్యానికి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస్ తరంగణి గౌరవాధ్యక్షులు టి.టి.వి రమణ మూర్తి వాకచర్ల వెంకట పైడిరాజు వికాస్ తరంగణి అధ్యక్షులు, సంస్కార వికాస కోఆర్డినేటర్ డొంక త్రినాధులు, డ్రాయింగ్ టీచర్లు పొదిలాపు కృష్ణ, బెవర సాయి శంకర్ , భారతి, గణపతి మొదలగువారు పాల్గొన్నారు.

ప్రధాన కూడలి, రహదారిపై లైట్లు వెలగకపోయినా పట్టించుకోని సిబ్బంది

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం ప్రధాన రహదారిలో ఉన్న సెంట్రల్ లైటింగ్ తోపాటు బొబ్బిలి జంక్షన్, అంబేద్కర్ జంక్షన్ లో ఉన్న జంక్షన్ మెయిన్ లైట్లులో ఉన్న ఆరు లైట్లలో కూడా రెండు లైట్లు తప్ప మిగిలిన నాలుగు లైట్లు వెలగకపోవడంతో పాటు ప్రధాని రహదారిలో ఉన్న సెంటర్ లైటింగ్ లో ఉన్న రెండువైపు లైట్లు కూడా కొన్నిచోట్ల వెలగటలేదు. వీటిని పర్యవేక్షించవలసిన సిబ్బంది కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో స్థానికులు పలు విమర్శలు చేస్తున్నారు. ఈ సమస్యపై రాజాం మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఏఈ భాగ్యలక్ష్మిని వివరణ కోరగా ఈ సమస్యను రెండు రోజుల్లో పరిష్కారం చేస్తామని ఆమె తెలిపారు. మరి ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కరిస్తారని వేచి చూడవలసిందే.

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు… విచారణ వాయిదా వేసిన హైకోర్టు

0

బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది మోహన్ రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని హైకోర్టుకు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్ విచారణకు అర్హమైనది కాదన్నారు. అనర్హత పిటిషన్లపై సభాపతి సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సిందే అన్నారు. ఈ సందర్భంగా పలు కోర్టుల తీర్పులను మోహన్ రావు ప్రస్తావించారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌కు వెళ్లారు.

సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్‌ సేవలు అందిస్తాం : కేంద్ర మంత్రి రామ్మోహన్‌

మరో 3-4నెలల్లో ఏపీలో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సీ ప్లేన్ కార్యక్రమం షో ఆఫ్ ప్రోగ్రామ్ లా కాకుండా అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ ప్రయాణం తీసుకురావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను ఓ సవాల్ గా తీసుకున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల వారూ సీ ప్లేన్ ప్రయాణం వినియోగించేలా ధరలు ఉంటాయని తెలిపారు. ఇందుకనుగుణంగా నిర్వాహకలకు తగు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.

4 రూట్లలో..

ఏపీలో 4 రూట్లలో సీ ప్లేన్ ప్రయాణం ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వైబులిటీ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు ఉదన్, టూరిజం శాఖలతో సమన్వయ పరుచుకుంటున్నామన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా సీ ప్లేన్ ధరలు ఉంటాయని స్పష్టం చేశారు. పర్యాటక రంగం కూడా గణనీయంగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీ ప్లేన్ పట్ల సానుకూలంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. సీ ప్లెయిన్స్ ఆపరేటింగ్‌కి కేవలం రెండు కిలోమీటర్లు వాటర్ ఉంటే సరిపోతుందన్నారు. ఎయిర్ పోర్ట్స్ లేని ప్రాంతంలో సీ ప్లేన్స్ బాగా ఉపయోగపడతాయని కామెంట్స్ చేశారు.

రెండు రోజుల్లో అల్పపీడనం.. 11, 13 తేదీల్లో కుండపోత

బంగాళాఖాతంలో రెండు రోజుల్లో అల్ప పీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశాలుండటంతో రాష్ట్రంలో పలు చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 11, 13 తేదీల్లో రాజధాని నగరం చెన్నైలో పలు చోట్ల కుండపోత వర్షం కురిసే అవకాశముందని తెలిపారు. ఇక ఈశాన్య బంగళాఖాతంలో ఏర్పడనున్న అల్ప పీడనం రెండరోజుల్లో పడమటి దిశగా శ్రీలంక తీరం వైపు నెమ్మదిగా కదులుతుందని తెలిపారు.

ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టులు.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

సీ ప్లేన్ సేవలు ప్రాంతీయ అనుబంధాలను మరింత పెంచుతాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. సీ ప్లేన్ కార్యకలాపాల కోసం 8ప్రాంతాలు ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. రహదారులు భవనాల శాఖకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి ప్రోత్సహకం లభిస్తోందని తెలిపారు. ఆర్ధిక వృద్ధి, పర్యాటకాభివృద్ధికి విమానాశ్రయాలు పెంచుతున్నామని వివరించారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణం ద్వారా ఎయిర్ కనెక్ట్విటీ పెంచుతున్నామని చెప్పారు. కుప్పం, దగదర్తి, పుటపర్తిలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రానికి పెనుముప్పుగా మారిన డ్ర‌గ్స్..

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మాద‌క‌ద్ర‌వ్యాల‌ విష‌య‌మై ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. గ‌త ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని గంజాయి, డ్ర‌గ్స్‌కు అడ్డాగా మార్చింద‌ని ఆరోపించారు. ఇదే ఇప్పుడు రాష్ట్రానికి పెనుముప్పుగా ప‌రిణ‌మించింద‌ని ట్వీట్ చేశారు. కేంద్ర హోంశాఖ స్పందించి డ్ర‌గ్ మాఫియాపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది. మునుపటి అవినీతి, నేర పాలన నుండి సంక్రమించిన మరొక వారసత్వ సమస్య. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కొంతకాలం క్రితం విశాఖపట్నంలో సీజ్ చేసిన డ్ర‌గ్స్ లింకులు విజ‌య‌వాడ‌లోని ఒక వ్యాపార సంస్థలో తేలాయి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. గత పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందింది. నేర‌గాళ్ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్రం చ‌ర్య‌లు తీసుకోవాలి. దీనికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరంఁ అని జ‌న‌సేనాని ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

సీప్లేన్‌ ట్రయల్‌ విజయవంతం

నేడు శ్రీశైలం వెళ్లనున్న సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్‌’ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని శనివారం ప్రారంభించనున్న నేపథ్యంలో శుక్రవారం అధికారులు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ నుంచి ‘సీ ప్లేన్‌’ శ్రీశైలానికి వెళ్లింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్‌ జట్టీ వద్దకు సీ ప్లేన్‌ చేరుకుంది. ఎస్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, టూరిజం, వైమానిక దళ అధికారుల సమక్షంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ నెల 9న విజయవాడ పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలానికి ‘సీ ప్లేన్‌’ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. డీ హవిల్లాండ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్ల్లేన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. అనంతరం ఆయన నేరుగా సీప్లేన్‌లో శ్రీశైలం వెళ్లి తిరిగి విజయవాడ చేరుకుంటారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు సీ ప్లేన్‌లో ప్రయాణం చేయనున్నారు. విజయవాడశ్రీశైలం మధ్య ఈ సీప్లేన్‌ప్లే నడిపేందుకు అనుకూలతలపై నిర్వహించే ఈ ప్రయోగం విజయవంతమైతే రెగ్యులర్‌ సర్వీసుగా ప్రారంభించాలని డీహవిల్లాండ్‌ ఎయిర్‌క్రాప్ట్‌ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. దీనిపై విజయవాడ సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పున్మమిఘాట్‌లో 1000 మంది ప్రజలు వీక్షించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. చంద్రబాబు రాకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఇక్కడకు రానున్నట్లు తెలిపారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీపీ రాజశేఖర బాబు వెల్లడిరచారు..

ఆచి తూచి ఎంపిక

. ‘నామినేటెడ్‌’ మలి జాబితాపై సీఎం ముమ్మర కసరత్తు
. వందల్లో పోస్టులు..వేల సంఖ్యలో ఆశావహులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : నామినేటెడ్‌ పదవుల ఎంపికపై కూటమి ప్రభుత్వం వడపోత ముమ్మరం చేసింది. తొలిదశలో 20 మందితో నామినేటెడ్‌ పోస్టుల జాబితా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, రెండో జాబితాలో కనీసం వంద మందికి తగ్గకుండా ఇచ్చేలా కసరత్తు నిర్వహిస్తోంది. రెండో విడత జాబితా ఎంపికపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పార్టీ ముఖ్యులతో మూడు రోజులుగా సమావేశమవుతున్నారు. ఇప్పటికే పవన్‌ నుంచి రెండో జాబితా లో జనసేన నుంచి అవకాశం ఇచ్చే వారి పేర్లను సేకరించారు. అలాగే బీజేపీ వారి పేర్లు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. వివిధ నామినేటెడ్‌ పోస్టుల కోసం ఒక్క తెలుగుదేశం పార్టీ నుంచే దాదాపు 30వేల పైచిలుకు నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బహిరంగంగా ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టడంతో నేతలు పెద్దసంఖ్యలో బారులు తీరి దరఖాస్తు పెట్టుకున్నారు. దీనివల్ల పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి మరింత పెరిగింది. శాసనసభ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పార్టీల ఎన్నికల పొత్తు కారణంగా టీడీపీ దాదాపు 31 స్థానాలను త్యాగం చేయాల్సి వచ్చింది. అలాగే ఎంపీ అభ్యర్థులు కూడా కొందరు తమ స్థానాలను పొత్తులో భాగంగా వదులుకున్నారు. వీరందరికీ న్యాయం చేస్తానని అప్పట్లో చంద్రబాబు వాగ్దానం చేశారు. వీరుగాక పార్టీ కోసం వైసీపీ ప్రభుత్వంలో అనేక కేసులు పెట్టించుకుని వీరోచిత పోరాటాలు చేసిన నేతలు కొందరున్నారు. వీరికి ప్రథమ ప్రాధాన్యతగా పోస్టులు కేటాయించనున్నారు. అయితే సామాజిక సమీకరణలు, కూటమి భాగస్వామ్యపక్షాలను పరిగణనలోకి తీసుకుని పదవుల కేటాయింపు చేపట్టనుండడంతో వడపోత కార్యక్రమం సీఎంకు సవాల్‌గా మారింది. తొలి జాబితాలో పేర్ల ప్రకటన తరువాత కొందరు నేతలు తమకు అవకాశం ఇవ్వకపోవటం పైన కినుక వహించారు. ఈ నేపధ్యంలో రెండో జాబితాలో జనసేన, బీజేపీ కోసం త్యాగం చేసిన నేతలతోపాటు, వైసీపీ ప్రభుత్వ వేధింపులు ఎదుర్కొని, జైలుకు వెళ్లిన వారికి ప్రాధాన్యత ఉంటుందని నేతలు చెబుతున్నారు. వివిధ కుల, వృత్తి సంఘాలకు కార్పొరేషన్‌ చైర్మన్లు కీలక నేతలకు, ద్వితీయశ్రేణి ముఖ్యనేతలను డైరెక్టర్లుగా నియమించనున్నారు. ఎక్కువ మంది నేతలు రాష్ట్ర స్థాయి పదవులు కోరుకుంటున్నారు. తొలి జాబితాలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా డైరెక్టర్ల పదవులు కేటాయించడంతో… వారిలో కొందరు తమకు ఆ పదవులు అవసరం లేదని, పార్టీలో పని చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ సారి జాబితాను అన్ని కోణాల్లోనూ ఆచి తూచి ఎంపిక చేస్తున్నారు. అయితే కచ్చితంగా సీట్లు దక్కని సీనియర్లకు ఈసారి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.ఈ నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఈ లోగానే నామినేటెడ్‌ పదవుల జాబితా విడుదల చేసినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.