ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం ; ఇంటర్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ రీజనల్ మీట్-24 నందు ప్రభుత్వ పాలిటెక్నిక్ ధర్మవరం విద్యార్థినీ విద్యార్థులు తమ ప్రతిభను చాటారని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సురేష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 20 వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ అనంతపురం , సత్యసాయి అనంతపురం జిల్లాలోని 17 పాలిటెక్నిక్ విద్యార్టిని విద్యార్థుల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించబడినది అని తెలిపారు.ఇందులో ధర్మవరం విద్యార్థులు వాలీబాల్, బాట్ మింటన్, చెస్ మహిళలు, 100 మీటర్ల, 200 మీటర్ల పరుగు పందెం లలో బంగారు పతకాలను సాధించారు అని తెలిపారు.జనవరి 28, 29, 30 తెదీలలొ విశాఖపట్నం లో జరిగే రాష్ట్రస్తాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు.ఈ విద్యార్థులను ఆటలలో తర్ఫీదు ఇచ్చిన ఇంగ్లిష్ ఉపాధ్యాయులు రాజేష్ను, అలాగే అన్ని విధాల సహకరించిన అధ్యాపకులు హరిబాబు, జానకి, ఉమమహేశ్వరి, సుశీల, రాకేష్ లను ప్రిన్సిపాల్ , ఇతర అధ్యాపకులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఐ పి ఎస్ జి ఎం–24 నందు ధర్మవరం పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రతిభ
ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ అధికారులు చొరవ చూపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి పేర్కొన్నారు. మండలంలో గవరవరం గ్రామ శివారులో ఉన్న మేఘాదేవినగర్లో ఆమె పర్యటించారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ, సిసి రహదారులు, మంచినీటి సౌకర్యాలు సరిగా లేవని కాలనీవాసులు మేఘలాదేవికి తెలిపారు. మేఘలాదేవి సంబంధిత అధికారులకు చర్వాణి ద్వారా తెలియచేయుగా అధికారులు సానుకూలంగా స్పందిస్తూ కాలనీవాసుల సమస్యలను పరిష్కరించడానికి ఉన్నత అధికారులకు తెలియచేసి, సమస్యలకు పరిష్కార మార్గం చూపుతామని అన్నారు. టిడిపి సభ్యత్వల నమోదును ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు చుక్కల శోభన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో వ్యవసాయ భూ ఆక్రమణలను అరికట్టండి
-తహశీల్దార్ పి.విజయకుమారి
విశాలాంధ్ర-రాప్తాడు: గ్రామంలో ఆక్రమణలకు గురైన వ్యవసాయ భూములను రక్షించాలని తహశీల్దార్ పి.విజయకుమారికి టీడీపీ నాయకులు, గ్రామస్తులు మరూరు గోపాల్, కేశవ, వడ్లమూడి వెంకటరాముడు, డీలర్ సూరి, ఫీల్డ్ అసిస్టెంట్ కదిరప్ప, మాజీ డీలర్ సూరి, వీరనారప్ప, గంజి నరేష్, కదిరప్ప వినతిపత్రం అందజేశారు. మండలంలోని మరూరు గ్రామంలో శనివారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామంలో ఆంజనేయస్వామి, నాగేశ్వరస్వామి, చౌడేశ్వరి, పోతులయ్య స్వామి దేవాలయాల మాన్యం భూములను సర్వే చేసి హద్దులు చూపించాలని కోరారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలకు సంబంధించిన రెండు ఎకరాలు ఆక్రమణకు గురైందని వాటిని తొలగించాలన్నారు. అదేవిధంగా మసీదు నిర్మాణానికి చేయూతనందించాలని ముస్లింలు కోరారు. వీటితోపాటు భూసర్వే, ఇంటి స్థలం, రేషన్ కార్డుల సమస్యల పరిష్కారానికి అర్జీలు వచ్చాయని తహశీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభావతి, బి.నారాయణస్వామి, కొండారెడ్డి, సర్వేయర్ రామాంజనేయులు, ఆర్ఐ కరుణాకర్, వీఆర్ఓ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంను కాపాడుకోవాలి..
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప
విశాలాంధ్ర ధర్మవరం;; గర్భిణీ స్త్రీలు ఆరోగ్యమును కాపాడుకోవాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని శివానగర్లో గల అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు బండ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విరాళమును జూటూరు సత్యనారాయణ సహకరించడం జరిగిందన్నారు. అనంత రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గౌతమి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ప్రతినెల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు తోపాటు తగిన టీకాలు కూడా వేయించుకోవాలని తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా గర్భిణీ స్త్రీలకు సహాయ సహకారాలను అందిస్తూ వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, చైర్మన్ నారాయణమూర్తి, కార్యదర్శి మంజునాథ్, కోశాధికారి చంద్రశేఖర్ సభ్యులు రామకృష్ణ, జగ్గా నాగరాజు, జింక చిన్నప్ప, ఏఎన్ఎం పుష్పలత, నారాయణమ్మ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
దాత డోల రాజారెడ్డికి మాల ధారణ భక్తాదులు ఘనంగా సన్మానం
విశాలాంధ్ర -ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయి నగర్ లో గల శిరిడి సాయిబాబా దేవాలయంలో గత కొన్ని రోజులుగా మాల ధారణ వేసిన భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని డోలా రాజారెడ్డి చేపట్టడం జరిగింది.ప్రతిరోజు 500 మందికి పైగా మాల ధారణ భక్తాదులు బిక్ష చేసి ఆశీస్సులను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే అన్నదాత సుఖీభవ.. అని డోలా రాజారెడ్డిని ఆశీస్సులను ఇస్తున్నారు. దాత అయిన డోలా రాజారెడ్డి అయ్యప్ప, శివ మాల ధారణ భక్తాదులకు అనునిత్యం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం ఒక వరంగా భక్తాదుల కుమారింది. మాల ధారణ భక్తాదులు మాట్లాడుతూ ఇటువంటి దాత వందలాది మందికి అన్నదానం చేయడం భగవంతుని సేవతో సమానమని తెలుపుతూ వారిని కొనియాడారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక ఆ శివుని అనుగ్రహంతో విజయవంతం కావడం ఎంతో సంతోషకరమని తెలిపారు. షిరిడి సాయిబాబా సిబ్బందికి దాత చేతులమీదుగా ఘన సన్మాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అదేవిధంగా దాత డోలా రాజారెడ్డి దంపతులను బాబా ఆలయ కమిటీ వారు, యోగా గురువు నారాయణరెడ్డి, వారి శిష్యులతో కలిపి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన వారందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా కృతజ్ఞతలను కూడా తెలియజేశారు. ఈ అన్నదాన కార్యక్రమం ఈనెల 21వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబా గుడి ఆలయ కమిటీ సభ్యులు, యోగ గురువు, శిష్యులు, మాల ధారణ భక్తాదులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు పనిముట్లు పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని నాలుగు డివిజన్లలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు అందరికీ పనిముట్లను మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ చేతులమీదుగా మాస్టర్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మొత్తం నాలుగు డివిజన్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు కు పనిముట్లు గతంలో లేకపోవడంతో ఎన్నో ఇక్కట్లను ఎదుర్కొనే వారని, నేడు పనిముట్లు పంపిణీ చేయడం వల్ల మరింత పరిశుభ్రత ఏర్పడుతుందని తెలిపారు. మొత్తం 164 మందికి పనిముట్లు పంపిణీ చేశామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై పరిష్కారానికి తాను కృషి చేస్తానని, వారు పని విధానంలో మెరుగు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు శాంసన్ ,కేశవ, మేస్త్రీలు ఆంజనేయులు, పార్థ, నరసింహులు , పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణకు 500 కోట్లు మంజూరు చేయాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్
విశాలాంధ్ర- అనంతపురం : అనంత, సత్యసాయి జిల్లాల్లో ఉపయోగపడే తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణకు వెంటనే రూ.500 కోట్లు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్, జిల్లా కార్యదర్శి సి. జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శులు పి నారాయణస్వామి, సి. మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి. జగదీష్ మాట్లాడుతూ… సత్య సాయి అనంత జిల్లాలో ఉపయోగపడుతున్న తుంగభద్ర ఎగువ కాలువ ఆధునికరణ కోసం ఇంతవరకు కూటమి ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు. ఆధునికరణ చేయడానికి 500 కోట్లు కావాల్సి ఉందన్నారు. ఆధునికరణ చేయడం వలన 30 టీఎంసీల నీళ్లు వస్తుంది అని దాని ద్వారా కర్నూలు, అనంతపూర్,కడప జిల్లాల్లో తుంగభద్ర జలాలు పంపడానికి సాధ్యమవుతుందన్నారు. దీనివలన చివరి ఆయకట్టు వరకు నీరు అందుతుందన్నారు. దీనికి 36 కోట్లు ఇవ్వడం వలన కాంట్రాక్టు జోబు నింపడానికే తప్ప పూర్తిస్థాయిలో ఆధునికరణ చేయడానికి ఏమాత్రం ఉపయోగపడదు అన్నారు. కరువు ప్రాంతమైన అనంత, సత్యసాయి జిల్లాల్లో ప్రతి ఏడాది తక్కువ వర్షపాతంతో రైతుల నష్టపోతున్నారన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టులపై ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప అనంత సత్యసాయి జిల్లాల ప్రాజెక్టుపై ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. జిల్లాలో ముఖ్యమైన నాయకులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు, చంద్రబాబుతో చర్చించి ఆధునీకరణ కోసం 500 కోట్లు విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. హంద్రీనీవా కాలువ వెడల్పు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. హంద్రీనీవా కాలువ ఆధునీకరణ చేసే నేపథ్యంలో అంతా కూడా కాంక్రీట్ వేయడం పూనుకోవడంవల్లన భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి అన్నారు. సెకండ్ ఫేస్ వర్క్ లో కాంక్రీట్ వేయకుండా నిలిపివేయాలని దీనివలన భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతుందన్నారు. రాయదుర్గం, కళ్యాణ్ దుర్గం జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీరు అందించి కాల్వ అభివృద్ధి చేయాలన్నారు. మూడు లక్షల 50 వేలు ఎకరాలకు హెచ్ఎసి కాల్వ ద్వారా రెండు లక్షల ఎకరాలకు నీరు అందించాలని సిపిఐ డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవడానికి సిపిఐ, రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ… విజయవాడలో జరిగిన సిపిఐ కార్యవర్గ సమావేశంలో ప్రధానాంశంగా ఇంటి పట్టాలకు సంబంధించి గత ప్రభుత్వం 32 లక్షల మంది ఇంటి స్థలాలు నివాసానికి యోగ్యంలేని గుట్టలు వంకలు, వాగులు మధ్యలో పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. టిడిపి ప్రభుత్వం ద్వారా గ్రామీణ స్థాయిలో నివాసం ఉన్నవారికి మూడు సెంట్లు, పట్టణంలో ఉండే వారికి రెండు సెంట్లు ఇస్తూ ఇల్లు నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. గత ప్రభుత్వం జగన్ ఆదానితో ఉన్నటువంటి ఒప్పందం సెగి ద్వారా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ రద్దు చేయాలన్నారు. 25 సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకోవడంతో ఒక లక్ష యాభై ఆరు కోట్ల ప్రజలపై భారం పడుతుందన్నారు. ప్రస్తుతం కరెంట్ బిల్లులో అనేక చార్జీలు కలుపుతూ చార్జీలు పెంచడం జరిగిందన్నారు. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు కరెంటు చార్జీలు తగ్గించాలని గ్రామ సచివాలయాలు, మండల ఎమ్మార్వో, కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో స్థాపించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 సంవత్సరాలు సందర్భంగా దేశవ్యాప్తంగా 100 సంవత్సరాల శతవార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని సిపిఐ పార్టీ నిర్ణయించడం జరిగిందన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్రం కోసం పోరాడిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అన్నారు. డిసెంబర్ 26వ తేదీన అన్ని ప్రాంతాలలో సిపిఐ జెండా ఆవిష్కరణ చేసి ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, నగర కార్యదర్శి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
భూ సమస్యలు శాశ్వత పరిష్కారమే రెవిన్యూ సదస్సుల ఉద్దేశం
మండల నోడల్ అదికారి, పి. కూర్మినాయుడు
తహశీల్దారు బి సుదర్శన రావు
విశాలాంధ్ర – నెలిమర్ల : భూ సమస్యలు శాశ్వత పరిష్కారమే రెవిన్యూ సదస్సుల ఉద్దేశమని మండల నోడల్ అదికారి, పి. కూర్మినాయుడు, తహశీల్దార్ బి సుదర్శన రావు అన్నారు. మండలంలోని మాల్యడ లో రెవెన్యూ సదస్సు శనివారం నిర్వహించారు. ఈ సందర్భగా మాట్లాడుతూ కొన్నేళ్లుగా భూ వివాదాలు, చేర్పులు – మార్పులు నెలకొన్న కారణంగా ఈ రెవెన్యూ సదస్సులో సమస్యలకు శాశ్వత పరిష్కారం జరుగుతుందని అన్నారు. ఈ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకొని భూ వివాదాలకు స్వస్తి పలకాలని అన్నారు. ఎలాంటి రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం అందరూ ఈ సదస్సుకు వచ్చినందున కొన్ని సమస్యలను ఇక్కడే పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు. అనంతరం వీధుల్లో తిరిగి కాలనీవాసుల సమస్యలను అడిగికి తెలుసుకున్నారు. అధికారులు మీ వద్దకు వచ్చినప్పుడు మీ సమస్యలను స్వచ్ఛందంగా వచ్చి తెలియజేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఐ వేణుగోపాల్, ఎం ఎస్ దివ్య మానస, వి ఆర్ ఓ గోవిందరావు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
భూ సమస్యలు శాశ్వత పరిష్కారమే రెవిన్యూ సదస్సుల ఉద్దేశం
మండల నోడల్ అదికారి, పి. కూర్మినాయుడు
తహశీల్దారు బి సుదర్శన రావు
విశాలాంధ్ర – నెలిమర్ల : భూ సమస్యలు శాశ్వత పరిష్కారమే రెవిన్యూ సదస్సుల ఉద్దేశమని మండల నోడల్ అదికారి, పి. కూర్మినాయుడు, తహశీల్దార్ బి సుదర్శన రావు అన్నారు. మండలంలోని మాల్యడ లో రెవెన్యూ సదస్సు శనివారం నిర్వహించారు. ఈ సందర్భగా మాట్లాడుతూ కొన్నేళ్లుగా భూ వివాదాలు, చేర్పులు – మార్పులు నెలకొన్న కారణంగా ఈ రెవెన్యూ సదస్సులో సమస్యలకు శాశ్వత పరిష్కారం జరుగుతుందని అన్నారు. ఈ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకొని భూ వివాదాలకు స్వస్తి పలకాలని అన్నారు. ఎలాంటి రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం అందరూ ఈ సదస్సుకు వచ్చినందున కొన్ని సమస్యలను ఇక్కడే పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు. అనంతరం వీధుల్లో తిరిగి కాలనీవాసుల సమస్యలను అడిగికి తెలుసుకున్నారు. అధికారులు మీ వద్దకు వచ్చినప్పుడు మీ సమస్యలను స్వచ్ఛందంగా వచ్చి తెలియజేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఐ వేణుగోపాల్, ఎం ఎస్ దివ్య మానస, వి ఆర్ ఓ గోవిందరావు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఉరవకొండలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
వైయస్ జగన్ పాలనను కోరుకుంటున్న ప్రజలు
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఎన్నికల్లో స్వప్రయోజనం కోసం ఎడాపెడా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై విసుగుచెందిన రాష్ట్ర ప్రజలందరూ జగన్ పరిపాలన కోసం ఎదురుచూస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువనేత వై. ప్రణయ్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి యువనేత ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ
చరిత్రలో ఎవరు చెయ్యని విధంగా సుపరిపాలన అందించిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రజలు జీవితాల్లో సమూల మార్పులకు నాంది పలికారని పేర్కొన్నారు. రాజకీయాల్లో వైయస్ జగన్ ప్రస్తావన ఒక చరిత్ర ఇచ్చిన మాటకు కట్టుబడి ఎందరికో ఆదర్శప్రాయుడు అయ్యారని కొనియాడారు రాజకీయాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే విలువలకు వైయస్ జగన్ నిలువెత్తు నిదర్శనం అన్నారు.
జగన్ లేని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కుంటుపడిందన్నారు. అనంతరం పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు వైయస్సార్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రడ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.