విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని కే.హెచ్ .ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ యూనిట్ అధ్వర్యంలో “విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ” అనే అంశంపై అవగాహన కార్యక్రమం కళాశాలలో నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపాల్ డా.కె.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎస్.నారాయణ స్వామి, ఆంగ్ల అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉరవకొండ, “విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్ -2047-విద్యాలో నైతిక విలువల ప్రాముఖ్యత” అంశపై అవగాహన కల్పిస్థూ, భారతదేశ అభివృద్ధి లోవిద్యార్థుల పాత్రను చక్కగా వివరించారు అని తెలిపారు. ఇందు లో భాగంగా కుటుంబంలోని వ్యక్తుల మధ్య సామాన్యం, సామాజిక చింతనపట్ల అవగాహన కల్పించడం జరిగిందన్నారు. విలువలతో కుడిన విద్యను అభ్యసించుకుని భారత దేశ భవిష్యత్తు అంతా యువతపై అధరపడి ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డా.బి.వెంకట రాముడు గణాంక శాస్త్రము ఉపన్యాసకులు ఎన్.ఎస్.ఎస్.అధికారి , ఉరవకొండ. డా.బి.గోపాల్ నాయక్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి, ఎస్ చిట్టెమ్మ,ఎ.కిరణ్‌కుమార్, బి.త్రివేణి, ఎస్.షమీఉల్లా, ఎస్.పావని, ఎ. ఎం.భువనేశ్వరి, పుష్పావతి,జి.మీనా, ఆనందు, బోధనేతర బృందం , విద్యార్థులు పాల్గొన్నారు.
భగవద్గీత శ్లోకములో పోటీల్లో బ్రిలియంట్ స్కూల్ ప్రతిభ
విశాలాంధ్ర ధర్మవరం;; భగవద్గీత శ్లోక పోటీల్లో ధర్మవరం శివానగర్ లోని బ్రిలియంట్ స్కూల్ పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరచడం జరిగిందని కరెస్పాండెంట్ సివి శేషు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురంలోని ఇస్కాన్ వారు నిర్వహించిన భగవద్గీత శ్లోక పారాయణము నందు మా పాఠశాల నుంచి 70 మంది విద్యార్థులు పాల్గొని అద్భుతంగా శ్లోకములను పారాయణం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం అనంతపురం ఇస్కాన్ అధ్యక్షులు సత్య గోపీనాథ్ దాస్ నుండి ప్రశంసా పత్రములను పొందడం జరిగిందని తెలిపారు. చదువుతోపాటు మన ఆధ్యాత్మిక , భగవద్గీత లాంటి చదవడం వల్ల మంచి మేధస్సు కూడా కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపి, లక్ష్మీదేవి, సుబ్బరాయుడు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవ వేడుకలు
ఎంఎండిఏ.. రాష్ట్ర అధ్యక్షులు ఇమామ్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎం ఎం డి ఏ జిల్లా అధ్యక్షుడు రోషన్ జమీర్ ఆధ్వర్యంలో, వారి కార్యాలయంలో ఘనంగా జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా రోషన్ జమీర్ మాట్లాడుతూ ఎం ఎం డి ఏ రాష్ట్ర అధ్యక్షులు ఇమామ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను గౌరవిస్తూ మైనారిటీ ప్రజల హక్కులను పరిరక్షించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యము అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు దాదాపీర్ తో పాటు సభ్యులు పాల్గొన్నారు.
భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తాం.. ఏఐఎఫ్డిఎస్
విశాలాంధ్ర ధర్మవరం;; భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తామని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (ఏఐఎఫ్డిఎస్) రాష్ట్ర కన్వీనర్ డక్క కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణములోని శ్రీనివాస జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజీలో విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం రాష్ట్ర కన్వీనర్ ఆధ్వర్యంలో నూతన శ్రీ సత్య సాయి జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా సంతోష్, కార్యదర్శిగా సాయినాథ్ రెడ్డి, కోశాధికారిగా చరణ్, ఉపాధ్యక్షులుగా అశోక్, సహాయ కార్యదర్శిగా గంగాధర్ తో పాటు 8 మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం రాష్ట్ర కన్వీనర్ డక్కా కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పైన అలుపెరుగని పోరాటాలు చేయాలని తెలిపారు. ప్రభుత్వం పేద పొడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను అందని ద్రాక్ష పండులా చేస్తూందని వారు మండిపడ్డారు. విద్యార్థులను బానిసలుగా మార్చి వేయడం కోసమే కేవలం కొన్ని ధనిక వర్గాల కోసమే నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. దేశంలోని విద్యార్థులకు అతి పెద్ద ప్రమాదం ముంచుకొస్తోందని, వెంటనే విద్యార్థులంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుపుతూ నూతన విద్యా విధానాన్ని రద్దు చేసేంతవరకు ఉద్యమాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. పెండింగులో ఉన్న ఫీజు రియబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు, తక్షణమే విడుదల చేస్తూ జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రైల్వే ప్రయాణికుల భద్రతే రైల్వే అధికారుల ముఖ్య లక్ష్యం..
ఆల్ ఇండియా డి జి ఆర్ పి ఎఫ్ అధికారి మనోజ్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం:: రైల్వే ప్రయాణికుల భద్రతే రైల్వే అధికారుల యొక్క ముఖ్యముగా తమ విధులను కొనసాగించాలని ఆల్ ఇండియా డీజీ ఆర్పిఎఫ్ అధికారి మనోజ్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం ఆర్పిఎఫ్ సీఐ. బోయ కుమార్ పలు విషయాలను మీడియా ద్వారా తెలియజేప్పాలన్న కేంద్ర అధికారుల ఆదేశం మేరకు ప్రజలకు తెలియజేశారు. అనంతరం బోయ కుమార్ మాట్లాడుతూ ఢిల్లీ కేంద్ర రైల్వే అధికారుల ఆదేశాల మేరకు ఢిల్లీలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో గల ఆర్పిఎఫ్ జి ఆర్ పి డిజిపి లెవెల్ లోని అధికారులు అందరికీ కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రయాణికుల భద్రత, రైల్వే భద్రత, ప్రమాద రహిత రైల్వే స్టేషన్గా నిర్వహణ, రైల్లో సురక్షిత ప్రయాణం, దేశవ్యాప్తంగా జరిగిన నేరాలను ఎలా అదుపు చేయాలన్న పలు అంశాలపై పూర్తి వివరణతో తెలియజెప్పడం జరిగిందన్నారు. ఢిల్లీలో ఐదవ ఆల్ ఇండియా జిఆర్పి చిప్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా రైల్వే భద్రత ప్రయాణికుల ఫిర్యాదులపై పరిష్కరించడం పైనే దృష్టి సారించడం జరిగిందని తెలిపారు. ఆర్పీఎఫ్, జి ఆర్ పి లతో నేరాలను తగ్గించే ప్రణాళిక, మెరుగైన రైల్వే భద్రత కోసం కీలకమైన మానవ వనరుల అవసరాలపై చర్చించడం జరిగిందన్నారు. భారతదేశ రైల్వే వ్యవస్థను మంచి గుర్తింపు వచ్చేలాగా రైల్వేలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తప్పక ఐక్యమత్యంతో, సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అదేవిధంగా రైల్వేలో మహిళలకు, పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఆర్పిఎఫ్ చేస్తున్న కృషిని వారు అభినందించారు. ముఖ్యంగా పెరుగుతున్న ప్రయాణికుల పై నేరాలను నివారించేందుకు ఆధునీకరించాల్సిన అవసరాన్ని వారు వివరించడం జరిగిందన్నారు. రైల్వేలో జరుగుతున్న ప్రధాన నేరాలను సమర్థవంతంగా పరిష్కరించాలని తెలిపారు. భారత దేశంలో విస్తృతమైన రైల్వే నెట్వర్క్ యొక్క భద్రత అవసరాలను తీర్చడానికి ప్రతి ఒక్కరూ నిర్మాణాత్మక స్కేలబుల్, ఫ్రేమ్ వర్క్ యొక్క అవసరాలను గుర్తించాలన్నారు. ఈ కాన్ఫరెన్స్ రైల్వే భద్రతను పటిష్టం చేయాలని మా సమిష్టి సంకల్పాన్ని ఈ సమావేశం పునరుద్ ఘాటించడం సంతోషదాయకం అని తెలిపారు. అంతేకాకుండా దేశంలోని రైల్వే వ్యవస్థలో ప్రయాణికులకు సుదక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు. రాష్ట్రంలోని రైల్వే జిఆర్పీల పాత్ర, రైల్వే భద్రత కోసం కొత్త బెంచ్ మార్కులను సెట్ చేయడం కొనసాగించాలని తెలిపారు. అదేవిధంగా అక్కడ పాల్గొన్న అధికారులందరూ కూడా ప్రయాణికుల భద్రతపై ప్రధాన ప్రాధాన్యత ఇస్తామన్న హామీతో సమావేశం ముగిసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశంలోని ఆర్పిఎఫ్, జి ఆర్ పి, డిజిపి లెవెల్ అధికారులు పాల్గొన్నారు.
మానవతా విలువలు పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
తారక్ చేయూత ట్రస్ట్ అధ్యక్షులు రామాంజి
విశాలాంధ్ర ధర్మవరం;; మానవతా విలువలు పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తారక్ చేయుట ట్రస్ట్ అధ్యక్షులు రామాంజి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా తారక్ చేయూత ట్రస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలను చేస్తోందని, కరోనా సమయంలో తాము చేపట్టిన సేవా కార్యక్రమాలకు ఎంతోమంది దాతలు ముందుకొచ్చి మాకు సహకరించడం మాకు ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇందులో భాగంగానే ధర్మవరం పట్టణంలోని శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్య గురువులు బాబు బాలాజీ యొక్క కుమార్తె ఆశ శ్రీ పుట్టినరోజు సందర్భంగా, తారక్ చేయుట ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణములోని రాజేంద్రనగర్లో గల అనాధాశ్రమంలో వృద్ధులకు అన్నదానముతో పాటు దుప్పట్లు కూడా వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. దాతలు ముందుకు వస్తే మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. అనంతరం డాన్స్ మాస్టర్ బాబు బాలాజీ మాట్లాడుతూ తారచయిత ట్రస్ట్ యొక్క సేవలు అనన్యమైనవని, దాతలు తమకున్న దానిలో ట్రస్ట్ వారికి సహకరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు. అనంతరం అనాధాశ్రమ నిర్వాహకులు తారక్ చేయిత ట్రస్ట్ వారికి, డాన్స్ మాస్టర్ బాబు బాలాజీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్ష శ్రీ, రామ లాలీత్య తదితరులు పాల్గొన్నారు.
మద్రస ఎ కాషిఫుల్ ఉలూమ్ ట్రస్ట్ క్యాలెండర్ ఆవిష్కరణ…
ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సయ్యద్ పారూక్
విశాలాంధ్ర ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని లోనికోట లో ఉన్నటువంటి మద్రస-ఎ- కాషిఫుల్ ఉలూమ్ ట్రస్ట్ కీ సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను హైదరాబాదులోని ఒక కార్యక్రమంలో ఆవిష్కరణ లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్ అనంతరం వారు మాట్లాడుతూ ఈ క్యాలెండర్ ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుందని అనంతరం సత్యసాయి జిల్లా నుంచి వచ్చిన చైర్మన్ సయ్యద్ ఉమర్ ఫారూఖ్ తదితరులను అభినందించారు.ఈ కార్యక్రమంలో మద్రస-ఎ- కాషిఫుల్ ఉలూమ్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సయ్యద్ ఉమర్ ఫారూఖ్, తెలుగుదేశం పార్టీ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రెటరీ ఫక్రుద్దీన్ ఆరిఫ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు..
రబిలో సాగు చేసిన పంటలకు ఇన్సూరెన్స్ చేయించుకోండి
అగ్రికల్చర్ ఆఫీసర్ ముస్తా పా
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామ రైతు సేవ కేంద్రం నందు రబీ సీజన్ కు సంబందించిన పంటలకు క్రాప్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లించి,మీ సేవ కేంద్రం లేదా కస్టమర్ సర్వీస్ సెంటర్ నందు ఇన్స్యూరెన్స్ చేసుకోవాల్సింది గా మండల వ్యవసాయ అధికారి ముస్తఫా రైతులకు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పంటల వారీగా వివరములు తెలుపుతూ,
వేరుసెనగ – 480రూ.ఎకరాకు, వరి -638 రూ. ఎకరాకు, మామిడి – 1800రూ ఎకరాకు,
అంతేకాకుండా టొమాటో – 1600రూ. ఎకరాకు చెల్లించి, ఇన్స్యూరెన్స్ కు డిసెంబర్ 31 వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాల్సింది గా తెలియచేసారు.
అలాగే కంది పంట ను పరిశీలించి నల్లి కోసం మెజిస్టర్ 1.5గ్రాం/లీటర్ నీటికి స్ప్రయింగ్ చేసుకోవాల్సింది గా తెలియచేశారు, కార్యక్రమం లో మండల కన్వీనర్ రాఘవ రెడ్డి , అజయ్, స్కూల్ చైర్మన్ – సీళ్ళ ఆనంద, గోవిందా రెడ్డి, జయచంద్ర రెడ్డి, చండ్రాయుడు, వీహెచ్ఏ. భార్గవ్,
ఏఐసీ ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిధి చాంద్ బాష తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ సమస్యలతో చేనేత కార్మికుడు రైలు కిందపడి ఆత్మహత్య..
ధర్మవరం జిఆర్పిఎస్ఐ దేవదాస్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని లక్ష్మీ నగర్ కు చెందిన పుల్లయ్య ఏకైక కుమారుడు చింతా కిరణ్(36) జీవితంపై విరక్తి చెంది, కుటుంబ సమస్యలు, వివాహం కాకపోవడం తదితర కారణాలతో గురువారం తెల్లవారుజామున గాంధీనగర్ రైల్వే గేట్- పోతుకుంట బ్రిడ్జ్ మధ్యలో రైలు కిందపడి మృతి చెందడం జరిగిందని జి ఆర్ పి-ధర్మవరం రైల్వే ఎస్సై దేవదాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుడు చింతా కిరణ్ చేనేత కార్మికుడిగా ఉంటూ తన తల్లిదండ్రులను చెల్లెళ్లను పోషించేవాడు. ప్రస్తుతం తల్లిదండ్రులు వృద్దులు కావడం, పెద్ద కుమార్తెకు అన్నగా వివాహం చేయడం, తెలిసిన, తెలియనిచోటల లక్షల్లో అప్పులు చేయడం జరిగిందన్నారు. తదుపరి రెండవ చెల్లెలు ఎంసీఏ పూర్తి చేసి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుందని తెలిపారు. కానీ మృతుడు చింతా కిరణ్ తనకు వివాహం కాలేదని, ఆడ పాపను ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాలేకపోవడం, కుటుంబ సమస్యల ఆర్థిక భారం అధికం కావడంతో ఎల్లప్పుడూ తల్లిదండ్రులతో తన బాధను పంచుకునే వాడని తెలిపారు. తదుపరి ఏమి చేయాలో తోచక, జీవితం మీద విరక్తితో, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రైలు కిందపడి చనిపోవడం జరిగిందని తెలిపారు. జిమెయిల్ ద్వారా సమాచారం అందుకున్న జి ఆర్ పి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలిస్తూ, అక్కడ చూడడానికి వచ్చిన స్థానికులతో వారు మాట్లాడటంతో, స్థానికులు గుర్తించి మృతుని వివరాలను తెలియజేశారు. తదుపరి తల్లిదండ్రులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్ట్మాస్టర్ నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. కుటుంబములో ఉన్న పెద్ద కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
నాణ్యమైన వస్తు సేవలను మాత్రమే కొనుగోలు చేయాలి.. ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;! నాణ్యమైన వస్తు సేవలలు మాత్రమే వినియోగదారులు కొనుగోలు చేయాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ను ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, వినియోగదారుల సంఘం, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్, ప్రిన్సిపాల్, విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు కలిసి పట్టణములో ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆర్డిఓ మహేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. తదుపరి ఆర్డిఓ ఆధ్వర్యంలో విద్యార్థులచే, అధ్యాపకులచే, ఉపాధ్యాయులచే వినియోగదారుల ప్రతిజ్ఞను చేయించడం జరిగిందన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ను స్ఫూర్తిగా, లక్ష్యంగా తీసుకొని ప్రజలందరికీ అవగాహన కల్పించాలని తెలిపారు. వినియోగదారుల చట్టం యొక్క హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని,తగిన న్యాయం పొందాలని తెలిపారు. అక్రమ వ్యాపార విధానా లలో బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. మోసపూరిత ప్రకటనలు ప్రభావితం కారాదని, కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు రసీదు పొందాలని, ఎమ్మార్పీ ధర కన్నా అధిక బిల్లు చెల్లించరాదని, కొనుగోలు సమయములో నాణ్యత, పరిమాణం, స్వచ్ఛత కూడిన ధరలు ఉండాలని తెలిపారు. వస్తువు యొక్క కొనుగోలు విషయంలో రాజీ పడకూడదని, కొనుగోలు విషయంలో మోసం జరిగితే అడిగే అధికార హక్కు ఉందని తెలిపారు. అవసరమైతే వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. వినియోగదారుల చట్టంపై సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు అవగాహన చేసుకున్నప్పుడే, ఎటువంటి అన్యాయం జరగదని, ఖచ్చితమైన న్యాయం అందరూ పొందవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఎస్ డి టి లక్ష్మీదేవి, ధర్మవరం తాసిల్దార్ సురేష్ బాబు, వినియోగదారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్ ,ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి, అధ్యాపకులు శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున, కరుణాసాగర్, రాజేశ్వర రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కుల్లయిరెడ్డి,ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ శైలజ, ఉపాధ్యాయులు వేణుగోపాలాచార్యులు, నౌరా, పట్టణ వినియోగదారుల సంఘం అధ్యక్షులు కుల్లాయప్ప కోశాధికారి రవీంద్ర గౌరవ అధ్యక్షులు గోవిందు సభ్యులు సుభాన్, నారాయణమ్మ, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.