Tuesday, November 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన అవగాహన కార్యక్రమం.. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి

కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన అవగాహన కార్యక్రమం.. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో “ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ” లో భాగంగా రక్తదాన అవగాహన కార్యక్రమంను నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.ప్రభాకర్ రెడ్డి తెలిపారు.ఈ కార్య‌క్ర‌మామికి ముఖ్య అతిధిగా డా.కె.శ్వేత, మేడికల్ ఆఫీసర్ పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ శ్వేత, ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రోగులకు ప్రతి సంవత్సరం రక్తమార్పిడి అవసరం అని, శస్త్రచికిత్సలకు, ప్రమాదాల తర్వాత, కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తం అవసరం అని తెలిపారు. ఒక వ్యక్తి రక్తదానం చేయడం ద్వారా ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్న ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు నని, రక్తదానం చేసే వారు ప్రాణాలను కాపాడే దేవతలతో సమానం అని తెలిపారు. ప్రతీవోక్కరు మీ మొబైల్స్‌లో వాట్సప్ నంబర్తో పాటు ప్రతి ఒక్కరి బ్లడ్ గ్రూప్ ను కూడా సేవ్ చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. గోపాల్ నాయక్, డా.ఎస్ షమీవుల్లా , ఎన్.సి.సి. అధికారి ఎస్.పావని, ఎ. కిరణ్ కుమార్,ఎం.భువనేశ్వరి, యం. పుష్పావతి బి. ఆనంద్, యం సరస్వతి, జి.మీనా, జి.ధనుంజయ, తదితర బోధన , బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు