Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం కోర్టులో బాంబు బెదిరింపు కలకలం

ధర్మవరం కోర్టులో బాంబు బెదిరింపు కలకలం

- Advertisement -

ఆర్డీఎక్స్ హెచ్చరికతో ధర్మవరం కోర్టు ఖాళీ

ధర్మవరం కోర్టులో విస్తృత తనిఖీలు

బాంబు బెదిరింపు మెసేజ్‌తో కోర్టు కార్యకలాపాలు నిలిపివేత

ఆర్డీఎక్స్ అలర్ట్‌తో పోలీసులు అప్రమత్తం
విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం కోర్టుకు బాంబు బెదిరింపు జిల్లా కోర్టు నుంచి ధర్మవరం కోర్టుకు మెసేజ్ రావడంతో విధుల్లో ఉన్న న్యాయవాదులు భయభ్రాంతులకు గురయ్యారు.
కోర్టు కాంప్లెక్స్‌లో ఆర్డీఎక్స్ బాంబు పెట్టినట్లు సందేశంలో పేర్కొనడంతో పాటు, మధ్యాహ్నం 12 గంటలకు బాంబు పేలే అవకాశం ఉందని హెచ్చరిక వచ్చింది.దీంతో వెంటనే కోర్టు ఆవరణలో ఉన్నవారందరినీ ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
సమాచారం అందుకున్న న్యాయవాదులు తమ విధులను నిలిపివేసి కోర్టు ప్రాంగణం బయటకు వెళ్లారు. ఘటనపై సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలోపోలీసులు కోర్టు ప్రాంగణానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.బాంబు స్క్వాడ్,డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్ల సహాయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.అయితే ఎలాంటి అనుమానాస్పద పేలుడు పదార్థాల ఆధారాలు లభించలేదని వన్‌టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా జిల్లా కోర్టుకు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న సమాచారాన్ని విచారణలో తొందరగా ప్రకటిస్తామని డిఎస్పి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు