అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్
విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు:తలకు బలమైన గాాయాల కారణంగామెదడు దెబ్బఅన్న వైద్యులు.కారణాలు ఏవైనా తలకు బలమైన గాయం తగిలిన వ్యక్తి ప్రాణాలను కాపాడటంలో మొదటి గంట ఎంతో కీలకమని, ఆ గంటలోపు చికిత్స అందకపోతే ప్రతీ సెకనుకు లక్షలాదిగా మెదడు కణాలు చనిపోతూ ఉంటాయని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అన్నారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ లో తలకు బలమైన గాయాలు తగిలిన వారికి సత్వరం చికిత్స అందించేందుకు అవసరమైన ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రపంచ తల గాయాల అవగాహన దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, న్యూరో సర్జరీ విభాగ అధిపతి డాక్టర్ ఏ.వి. రమణమూర్తి, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్, హాస్పిటల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ విభాగ కన్సల్టెంట్ డాక్టర్ ఎంశ్రీనివాస్, న్యూరో సర్జన్ డాక్టర్ ఉబేద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ ఏ.విరమణమూర్తి, డాక్టర్ వెంకట్ మీడియాతో మాట్లాడారు. ప్రతీ ఏడాది మార్చి 20న జరుపుకునే ప్రపంచ తల గాయాల అవగాహన దినోత్సవంలో తలకు బలమైన గాయాలు తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహ
స్తున్నామన్నారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు, ప్రమాదవశాత్తూ కింద పడిపోవడం, భవన శిథిలాల క్రింద పడ
టంకారణాలు ఏవైనా తలకు బలమైన గాయాలు తగిలితే దాని ప్రభావం మొదటగా మెదడుపై పడుతుందని, ఎక్కువగా శాతం మెదడుకు తీవ్రమైన గాయం తగిలే అవకాశం ఉందన్నారు. దీంతో జ్ఞాపక శక్తిని కోల్పోవడం, దృష్ఠి లోపాలు రావడం, తలనొప్పి, మానసిక స్థితిలో మార్పులు సంభవిస్తాయన్నారు. కారణం ఏదైనా తలకు బలమైన గాయాలు తగిలితే వెంటనే ఆ వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని వెల్లడించారు. వ్యక్తి ప్రాణాలు కాపాడటంలో మొదటి గంట ఎంతో కీలకమని, ఆ లోపు చికిత్స అందకపోతే గంటకు లక్షకుపైగా మెదడు కణాలుచనిపోతుంటాయని హెచ్చరిం
చారు. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం, కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించడం, ఇతర సురక్షితమైన చర్యలు అవలంభించడం ద్వారా తలకు గాయాలు తగలకుండా ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు.ఆల్కహాలు, మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్మాట్లాడుతూ లేదా వినియోగిస్తూ వాహనాలు నడపడం, మితిమీరిన వేగంతో అలసటతో లేటుగా వాహనాలు నడపడం మానివేయాలని సూచించారు. హెల్మెట్ ధరించడం కచ్చితంగా తల గాయాలనుంచి కాపాడుతుందని తెలి
పారు. అదేవిధంగా రోడ్డు నాణ్యత ప్రమాణాలు పాటించాలని తద్వారా ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు.తలకు బలమైన గాయాలు తగిలిన వారికి అత్యవసర చికిత్స అందించేందుకు నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో అవసరమైన ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ ఏ.వి. రమణమూర్తి, డాక్టర్ వెంకట్ తెలియజేశారు. క్రిటికల్ కేర్ విభాగంలో ప్రపంచ స్థాయి వైద్య సేవలతో అందిస్తామన్నారు. అంతే కాకుండా 24 గంటలూ వైద్యులు, న్యూరో సర్జన్లు, న్యూరాలజిస్టులు, అనస్థీషియాలజిస్టులు, రేడియాలజిస్టులు, ట్రామా సర్జన్లు, ఆర్ధో వైద్యులు, క్రిటికల్ కేర్ నిపుణులు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. అంతే కాకుండా నెల్లూరు అపోలో హాస్పిటల్ లో సిస్టెర్నోస్టమీ అనే కొత్త అధునాతన మెదడు శస్త్ర చికిత్సను ప్రారంభించామని, తలకు బలమైన గాయం తగిలి మెదడు దెబ్బతిన్న వారికి ఈ శస్త్ర చికిత్స చేస్తే రోగులుత్వరగా కోలుకుం
టారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వీరితో పాటూ నెల్లూరు అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు, వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.