విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గల రోగులకు శ్రీ సత్య సాయి సేవ సమితి -2, పిఆర్టి సర్కిల్, సుబ్బదాసు భజన మందిరం వారు దాదాపు 150 మందికి పాలు, బ్రెడ్, బిస్కెట్లను పంపిణీ చేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ అన్ని దానముల కన్నా అన్నదానం ఎంతో ముఖ్యమని, దీని ద్వారా మానవతా విలువలు పెరిగే అవకాశం ఉన్నాయన్నారు. ఆకలి గున్న వ్యక్తికి సంతృప్తిగా అన్నమును పెడితే అది దైవ స్వరూపంతో సమానమని తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతగా పెనుకొండ విఆర్ఓ బాలయ్య నిర్వహించినందున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పేంద్ర నాయక్ మాట్లాడుతూ శుభదాసు భజన మందిరం వారు నిర్వహిస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు రోగులకు వరంగా మారాయని, ఎంతోమందికి స్ఫూర్తి దాతలుగా నిలుస్తారని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలకు దాతలు కూడా ముందు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం పంపిణీ
- Advertisement -
RELATED ARTICLES


