విశాలాంధ్ర ధర్మవరం : పట్టణం లో ఎన్జీవో హోమ్ నందు ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రీషియన్స్ కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు హాజరుయ్యారు.ఈ కార్యక్రమం లో కార్మికుల సమస్యలు గురించి చర్చించడం జరిగింది.కార్మికుల గురించి వారికీ ఏ సమస్య వచ్చిన ఏ ఐ టి యు సి కార్మిక సంఘం, భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ కార్మికుల కి ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలిపారు. ఐక్యమత్యంగా ఉన్నప్పుడే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.ఈ కార్యక్రమం లో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, ప్లంబర్స్, అండ్ ఎలక్ట్రీషియన్ కార్మిక సంఘం అధ్యక్షులు, గోవిందరాజు, కార్యదర్శి లక్ష్మనారాయణ,తాజుద్దీన్,సుబ్బు,ప్లంబర్ కార్మికులు మసూద్,చిన్న, జనార్దన్, పీరా, సురేంద్ర,ఓబులేసు,తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు గురించి అవగాహన కార్యక్రమం
- Advertisement -
RELATED ARTICLES


