సూపర్వైజర్ సునీత
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : తల్లిపాలతో బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అంగన్వాడి సూపర్వైజర్ సునీత అన్నారు.గురువారం కందుకూరు ప్రాజెక్ట్ పరిధిలోని వలేటివారిపాలెం మండలం లోని చెర్లోపాలెం అంగన్వాడీ సెంటర్ లో సీడీపీఓ మాధవిలత సూచనల మేరకు సూపెర్వైజర్ సునీతఅధ్యక్షతన తల్లిపాల వారోత్సవాలు ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సూపర్వైజర్ సునీత మాట్లాడుతూ తల్లిపాలు సంపూర్ణ పోషకాహారం అని, ప్రకృతి వరం అని అమృతం లాంటివి అనిఅన్నారు. బిడ్డ పుట్టిన అరగంటలోపు బిడ్డకు ముర్రు పాలు పట్టించాలని అన్నారు బిడ్డకు మొదటి వ్యాధి నిరోధక టీకా అని, తల్లిపాల సంస్కృతి ప్రోత్సాహానికి ప్రాధాన్యత ఇద్దాం అని అన్నారు.తల్లిపాలు బిడ్డ హక్కు, తొలి టీకా, జీవితానికి కవచం, ఆరోగ్య భవితకు బలమైన పునాది అని తెలియజేశారు. తల్లిపాలు ఇవ్వడం వలన బిడ్డకే కాదు తల్లికి కూడా శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా రక్షణ లభిస్తుంది అని తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపెర్వైజర్ సునీత , స్కూల్ టీచర్.వసుంధర, ఆశ కార్యకర్త, ఎంఎల్ హెచ్ పీ అంగన్వాడీ కార్యకర్తలు రమ, భారతి, మనోహర్, హైమ ఆయా సరళ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


