— జిఎం పలివెల రాజు
విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; : కేవలం ఒక్క రూపాయికే సిమ్ కార్డు అందించి మొదటి నెలలో 30 రోజుల అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్. లతో పాటు రోజుకు 2 జీబీ డేటా ఉచితంగా ఇస్తున్నట్లు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) రాజమహేంద్రవరం బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు చెప్పారు. ఈ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ ఈ నెలాఖరు వరకే ఉంటుందని ఆయన చెబుతూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక గోకవరం బస్టాండ్ సమీపాన ఉన్న నన్నయ్య సంచార భవనం 2వ అంతస్తులోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఉదయం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫ్రీక్వెన్సీ పెంచుతున్నామని, తక్కువ రీచార్జి ప్లాన్స్ తో మెరుగైన సేవలు అందించడానికి బిఎస్ఎన్ఎల్ కృషి చేస్తోందన్నారు. 30 రోజులకు రూ 199, 180 రోజులకు రూ 897, 365 రోజులకు రూ 1999, 395 రోజులకు రూ 2399 ల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయని జీఎం పలివెల రాజు చెప్పారు. రూ 400కే జిఎస్టితో సహా ఇంటర్నెట్, 444 ఛానల్స్ , 9ఓటీటీలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్టీవి ప్లాన్స్ , డేటా ప్లాన్స్ తక్కువ చార్జితో రీచార్జి చేసుకోవచ్చన్నారు. ఏజన్సీలో కూడా టవర్స్ అదనంగా పెట్టి ఫ్రీక్వెన్సీ పెంచామన్నారు. సిగ్నల్ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని , ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ అందించే సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. డిజిఎం లు సత్యనారాయణ, శైలజ, ఎజిఎంలు భమిడి శ్రీనివాస్, శారద, జయశ్రీ, విజయ భాస్కర రెడ్డి, రవీందరబాబు, డీఈ లు భీమరాజు , అప్పారావు, ఎస్ డీఈలు సురేష్ కుమార్, నాగార్జున, కృష్ణ, పీఆర్వో కె వాసు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
రూపాయికే బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు
- Advertisement -
RELATED ARTICLES


