అకాడమీ రాష్ట్ర సభ్యులు అభిరామ్, మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బి ఎస్ ఆర్ పురపాలక బాలికల ఉన్నత పాఠశాల రాష్ట్రానికే స్ఫూర్తిదాయకమని, విద్యాశాఖ ప్రతిష్టను మరింత పెంపొందించడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర అకాడమీ సభ్యులు అభిరాం ఐఏఎస్, మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలను వారు సందర్శించారు. అక్కడ బోధిస్తున్న చదువు తీరును, విద్యార్థుల యొక్క చదువు తీరును హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి, ఉపాధ్యాయుల ద్వారా అడిగి తెలుసుకుని అభినందించారు. అనంతరం అభిరామ్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఈ పాఠశాల బాలికలదే పై చేయి కావడం మరుపురాని విషయమని తెలిపారు. ఈ పాఠశాలలో పేద విద్యార్థినీలు క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో పదవ తరగతి పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరచడం ఆనందించదగ్గ విషయమని తెలిపారు. అంతేకాకుండా 2026 విద్యా సంవత్సరంలో త్రిబుల్ ఐటీ సీట్లను 18 మంది విద్యార్థినీలు సాధించడం ఆశామాషి కాదని, ఎందుకు కృషిచేసిన ఉపాధ్యాయులకు మా వంతున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణ ఉత్సాహంగా విద్యను అభ్యసించి దేశస్థాయిలో ప్రముఖ ఉద్యోగాలలో అర్హత సాధించాలని వారు తెలిపారు. ధర్మవరమునకు జిల్లాకు మరింత మంచి పేరు తీసుకొని రావాలని వారు కొనియాడారు. తదుపరి మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు మాట్లాడుతూ బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల ధర్మవరంలో ఎంతో విద్యా విషయంలో మంచి గుర్తింపును, క్రమశిక్షణలో ఉత్సాహభరితమైన కీలకపాత్రను పోషించిందని తెలిపారు. నేడు 18 మంది విద్యార్థినీలు త్రిబుల్ ఐటీ కి ఎంపిక కావడం గర్వించదగ్గ విషయమని, ప్రభుత్వం ఆరు సంవత్సరాల పాటు ఉచిత విద్యతో పాటు అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా అభిరామ్ తన వంతుగా అకాడమీ ద్వారా విద్యార్థులకు సివిల్స్ కోచింగ్ సరి సమానంగా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం ఆ 18 మంది విద్యార్థులను వారు ఘనంగా సన్మానించి, ప్రత్యేక అభినందన శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు నాగేంద్ర, పాఠశాల కమిటీ చైర్మన్ బాబావాలి,హెడ్మాస్టర్ తో పాటు పాఠశాల ఇంచార్జ్ ప్రకాష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బి ఎస్ ఆర్ బాలికల ఉన్నత పాఠశాల రాష్ట్రానికే స్ఫూర్తిదాయకం..
- Advertisement -
RELATED ARTICLES


