Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజిల్లా స్థాయి యోగ పోటీల్లో రిషి విద్యాలయ విద్యార్థుల ప్రతిభ

జిల్లా స్థాయి యోగ పోటీల్లో రిషి విద్యాలయ విద్యార్థుల ప్రతిభ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రుషి విద్యాలయ పాఠశాల విద్యార్థులు శ్రీ సత్య సాయి యోగాసనా అసోసియేషన్ జిల్లా స్థాయి పోటీల్లో మంచి ప్రతిభను ఘనపరిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి యోగాసన అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్ యోగాసన పోటీలలో రిషి విద్యాలయ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ ఘనపరచడం పట్ల వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. యోగ సబ్ జూనియర్ విభాగంలో3 బంగారు పథకాలు,2 రజత పతకాలు ,3 కాంస్య పతకాలు సాధించి పాఠశాలకు కీర్తి తేవడం జరిగిందన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు పంకజ్ వెంకటా ప్రసాద్ ,తేజ ప్రకాష్ , గగన్ గీత్ రెడ్డి అను 7వ తరగతి విద్యార్థులు ఎంపికయ్యారు అని తెలిపారు.”యోగా విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి అత్యంత ఉపయోగకరమైనది అని తెలిపారు. అందుకే మా రిషి విద్యాలయ హాస్టల్‌లో ప్రతిరోజూ యోగా తరగతులను నిర్వహిస్తూ విద్యార్థులకు క్రమం తప్పకుండా శిక్షణ అందిస్తున్నాం అని తెలిపారు. జిల్లా స్థాయిలో విజయం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. తదుపరి
యోగ టీచర్ తిరుమలేష్కు అభినందనలు తెలిపారు. అకాడెమిక్ ఇన్‌చార్జ్ అశ్వతి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా విజయం సాధించి పాఠశాల పేరును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణి ఏవో రంగారెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందన శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు