పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతంలో రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా సర్కార్ ఈరోజు(గురువారం) ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి రిట్రోస్పెక్టివ్‌గా అమలు కానుంది. అలాగే, 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ పొందిన అర్హులైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. మళ్లీ జాబ్‌లో చేరే వరకు ఉన్న గ్యాప్ పీరియడ్‌కు జీతం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్యాప్ పీరియడ్‌ను సీనియారిటీ, ప్రమోషన్ల కోసం పరిగణనలోకి తీసుకోరని పేర్కొంది.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు
- Advertisement -
RELATED ARTICLES


