ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రాన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏ. వెంకటేశు
విశాలాంధ్ర ధర్మవరం : భారత ఎన్నికల సంఘం , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ ఐ ఆర్ఉ2026) కింద ఇంటింటి సర్వే (ఇంటింటా వెరిఫికేషన్) కార్యక్రమం 2026 జూన్ 15 నుండి జూలై 14 వరకు నిర్వహించబడుతోంది అని ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం-ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏ .వెంకటేశు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 27వ తేదీ నాటికి ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో 91.84 శాతం ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ పూర్తయింది అని తెలిపారు. మిగిలిన ఫారమ్‌ల పంపిణీ కూడా వేగంగా కొనసాగుతోంది అని, అలాగే, ఓటర్లు సమర్పించిన నింపిన ఎన్యూమరేషన్ ఫారమ్‌లలో 17.84 శాతం ఫారమ్‌లను స్వీకరించి, డిజిటైజేషన్ పూర్తి చేయబడింది అని తెలిపారు. ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారమ్ అందని ఓటర్లు తమకు సంబంధించిన బి ఎల్ వో ను ను సంప్రదించి ఫారమ్‌ను పొందవలసిందిగా వారు తెలిపారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జూన్ 27 , 28 తేదీలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడుతోంది అని. ఈ రెండు రోజుల పాటు ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో సంబంధిత బి ఎల్ వో లు ఇంటింటికీ వెళ్లి, ఓటర్లు నింపిన ఎన్యూమరేషన్ ఫారమ్‌లను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు.ప్రతి ఎన్యూమరేషన్ ఫారమ్ పైభాగంలో సంబంధిత బి ఎల్ ఓ మొబైల్ నంబర్ ముద్రించబడి ఉంటుంది అని, ఫారమ్ నింపడంలో ఓటర్లకు ఏవైనా సందేహాలు లేదా ఇబ్బందులు ఉన్నట్లయితే సంబంధిత బి ఎల్ వో ను సంప్రదించాలన్నారు. బి ఎల్ ఓ లు ఫారమ్‌ను సక్రమంగా నింపేందుకు అవసరమైన సూచనలు, మార్గదర్శకత్వం , పూర్తి సహాయాన్ని అందించడం జరుగుతుందన్నారు.
అందువల్ల ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లందరూ జూన్ 27, 28 తేదీలలో తమ నివాసాల్లో అందుబాటులో ఉండి, ఇంటికి వచ్చే బి ఎల్ ఓ లకు లకు పూర్తిగా నింపిన ఎన్యూమరేషన్ ఫారమ్‌తో పాటు ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అందజేసి సహకరించవలసిందిగా వారు తెలిపారు. ఒకవేళ బి ఎల్ వోలు ఇంటికి వచ్చిన సమయంలో అందుబాటులో లేకపోతే, ఎన్యూమరేషన్ ఫారమ్‌పై ముద్రించబడిన బి ఎల్ ఓ మొబైల్ నంబర్‌ను సంప్రదించి, తమకు అనుకూలమైన సమయంలో నింపిన ఫారమ్ , పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అందజేయాలన్నారు.భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన వలెను అని తెలిపారు. బి ఎల్ ఎలు ఓటరు వివరాల ధృవీకరణ, క్లెయిమ్‌లు , అభ్యంతరాల పరిశీలన ప్రక్రియలో ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఓటర్ల జాబితా ఖచ్చితత్వాన్ని మరింత మెరుగుపరచేందుకు తమ వంతు సహకారాన్ని అందించాలని తెలిపారు.
ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లందరూ ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, నింపిన ఎన్యూమరేషన్ ఫారమ్‌లను సకాలంలో సంబంధిత బి ఎల్ ఓ లకు అందజేసి, ఓటర్ల జాబితా ఖచ్చితత్వాన్ని మరింత మెరుగుపరచేందుకు ఎన్నికల సంఘానికి సహకరించవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు.
ఎస్ ఐ ఆర్ కార్యక్రమం జూలై 14 వరకు నిర్వహించబడుతుంది..
- Advertisement -
RELATED ARTICLES


