విశాలాంధ్ర- నందిగామ:-మండల పరిధిలోనే లింగాలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మవారి తిరుణాల మహోత్సవాలు గత ఐదు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారిని అలంకార ప్రాయంగా దర్శనం అందిస్తున్నారు. ఆలయ చైర్మన్, ఆలయ అధికారులు పర్యవేక్షణలో తిరుణాల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మవారి తిరునాళ్ల పురస్కరించుకొని గ్రామంలోని జిల్లా పరిషత్ ఆవరణలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో పశు ప్రదర్శన బండ లాగుడు పోటీలు గత ఐదు రోజులుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు,శుక్రవారం సాయంత్రం జూనియర్ ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలను మండల టిడిపి ఉపాధ్యక్షుడు ఉమ్మనేని విక్రమ్ ప్రారంభించారు, మొత్తం 8 జతలు పాల్గొన్న జూనియర్ ఎడ్ల కు 17 క్వింటాళ్ల 50 కేజీల బరువుతో బండ లాగుడు పోటీలను జరుపగా పలు గ్రామాల నుండి ప్రజలు రైతులు పెద్ద సంఖ్యల తరలివచ్చి తిలకించారు గురువారం రాత్రి న్యూ క్యాటగిరి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీల్లో పలనాడు జిల్లా కోసూరు మండలం ఉదయ్యందన గ్రామం సంపటం వీర బ్రహ్మనాయుడు ఎడ్ల జత 3823 దూరం లాగే మొదటి స్థానంలోనూ,తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం హుజూర్ నగర్ గ్రామానికి చెందిన జక్కుల సహస్ర యాదవ్ కోదాడ మండలం కోదాడ గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ కంబైన్ ఎడ్ల జత 3559 అడుగుల దూరం లాగే రెండో స్థానంలోనూ, తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం తుర్కాంపల్లి గ్రామానికి చెందిన డి రోహన్ బాబు 3505 అడుగుల దూరం లాకి మూడో స్థానంలో నిలిచాయి కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం చిన్న పులి పాత గ్రామం ఆర్ వి ఎస్ ఎడ్లు కృష్ణాజిల్లా గన్నవరం మండలం ఎం పల్లి గ్రామం కొలుసు శ్రీనివాస్ యాదవ్ ల కంబైండ్ జత 3002 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలవగా,ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం మర్రి వేముల గ్రామం సిద్ధి మల్లేశ్వరి ఎడ్ల జత 2830 దూరం లాగి 5వ స్థానంలో నిలచాయి, పలనాడు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామం యామిని మోహనశ్రీ ఎడ్ల జత 2750 అడుగుల దూరం లాగే ఆరో స్థానంలో నిలిచాయి,గెలుపొందిన ఎడ్ల యజమానులకు పశు పోషక కమిటీ సభ్యులు వడ్లమూడి శ్రీనివాసరావు,రాంబాబు,మధుసూదన్ రావు,ఘంటా శివాజీ,వెంకటేశ్వరరావు,శ్రీహరీ నగదు జ్ఞాపిక ను దాతల సహాయంతో అంద జేయగా అంబారుపేట సత్తెమ్మ తల్లి దేవాలయం మాజీ చైర్మన్ గరికిపాటి భాస్కరం సోదరులు ఎడ్ల యజమానులకు నూతన వస్త్రాలు అందజేశారు
ఘనంగా ముగిసిన ఎడ్ల బండ లాగుడు పోటీలు…
RELATED ARTICLES