Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాకారు మొబ్బులు ఒక వైపు - ధాన్యం రైతులు మరొక వైపు

కారు మొబ్బులు ఒక వైపు – ధాన్యం రైతులు మరొక వైపు

- Advertisement -

ఎన్టీఆర్ జిల్లా – ఎ కొండూరు : పొలం దున్నారు నారు పోశారు పొలంలో వరి నాటు వేసారు.. అంత బాగుంది అనుకున్న దానికి అంటే ఈ ఏట పంట బాగా పండింది ప్రభుత్వం ధాన్యాన్ని మద్దతు ధర ప్రకటించింది అంత సజావుగా అధికారులు ధాన్యాన్ని గబగబ రావణ చేస్తారు అనుకున్న రైతులు ఉప్పులో కాలు వేసి నట్లు అయ్యింది అని వాపోతున్నారు..
ఎ కొండూరు మండలంలో కొంతమేర ధాన్యాన్ని రైతులు వద్ద నుండి మిల్లర్ల కు రవాణా చేసిన చాలా వరకు ధాన్యం కల్లల లో రాశులు పోసి ఎదురు చూస్తున్న కొంత మంది రైతులు ఐతే మరికొంత మంది రైతులు డీసీఎంఎస్ కోపరేటివ్ శాఖ అధికారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి రవాణా కోసం ఎదురుచూస్తున్న మరి కొంతమంది రైతులు, ఆరుగాలం కష్టించి పండించి రాత్రి అనక పగలు అనక ధాన్యం కల్లల వద్ద కంటిమీద కునుకు లేకుండా కాపలా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో తేమ శాతాన్ని పరీక్షించి అధికారులు రోజులు తరబడి కల్లాలలోనే ధాన్యాన్ని ఉంచి మిల్లర్లకు కొమ్ము కాస్తూ వెంట ధాన్యానికి ప్రభుత్వం చెప్పిన తరుగు మూడు కేజీలు కాకుండా ఐదు నుండి ఎనిమిది కేజీల వరకు తరుగు విధించి రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నారు, ధాన్యంలో 8 కేజీల తరుగు మేము ఇవ్వలేమని అధికారులకు స్కూటీ గా చెప్పిన రైతులకు సంబంధిత శాఖ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు, మేము చెప్పినట్టు వినకుండా ధాన్యం కల్లాలలోనే ఉంచుకుంటే మీ ధాన్యాన్ని కొనే దిక్కు ఉండదని, అనవసరంగా వర్షాలు పడితే ధాన్యం తడిసిపోతుందని ఆ తరువాత మీ ఇష్టంఅని రైతులకు అధికారులు చెబుతున్న సందర్భాలు తెలుస్తున్నాయి ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రభుత్వం పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేయమని చెప్తే సంబంధిత శాఖ అధికారులు మాత్రం మిల్లర్లకు కొమ్ముకాస్తూ వారిచ్చే తగిలాల కోసం ఎదురుచూస్తూ రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు మండల ప్రాంత రైతుల నుండి కనబడుతున్నాయి, అన్ని బాగుండి సివిల్ సప్లై అధికారులు లారీలను రవాణాకు పంపితే, మిల్లర్లు ధాన్యం మిల్లుకు తీసుకొని వెళ్లిన లారీలను రోజుల తరబడి మిల్లర్లు తమ దగ్గరే ఉంచుకోవడంతో ధాన్యం రవాణాకు లారీలు వచ్చే పరిస్థితి కనబడడం లేదు, ఒకవేళ ధన్యం రవాణాకు వాహనాలు వచ్చిన మిల్లర్లు ఎన్ని రోజులు అయితే ధాన్యం బస్తాలను లారీల నుండి దిగుమతి చేయరో అన్ని రోజులకు రైతులు, వాహన నిలుపుదల చార్జీలను, రైతులే ఇవ్వాలని ఆంక్షలు పెడుతున్నారట అధికారులు, అసలు అధికారులు మిల్లర్ల వద్దకు వెళ్లి, ధాన్యం ఎందుకు దిగుమతి చేసుకోవడం లేదు అని ప్రశ్నించడం లేదు అని రైతులు వాపోతున్నారు, మండలంలో ఏదో ఒక పర్యటనతో జిల్లాస్థాయి అధికారులు వచ్చినప్పుడు మాత్రం మిల్లర్లు అధికారులు చక చక రోజులు తరబడి ఉన్న ధాన్యం వాహనాలను దిగుమతులు చేపిస్తున్నారు , అని రైతులు చెబుతున్నారు, ధాన్యం కొనుగోలు విషయంలో డీసీఎంఎస్ కోపరేటివ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతుందని రైతులు వాపోతున్నారు ఒకటికి పది సార్లు ధాన్యం కొనుగోలు విషయం గన్ని బ్యాగుల విషయం, రవాణా విషయాలపై డీసీఎంఎస్ జిల్లా స్థాయి అధికారులకు చెప్పిన కనీసం చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ధాన్యాన్ని రోజుల తరబడి ఎండలో ఆరబెట్టి బస్తాలను కల్లాలలోనే ఉంచితే అనుకోకుండా ఎ అర్థ రాత్రో అకాల వర్షం వచ్చి ధాన్యం బస్తాలు రాశులు తడిచిపోతే అధికారులు బాధ్యత తీసుకుంటారా? లేక ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? అనే ప్రశ్న కూడా రైతుల నుండి ఉత్పన్నమవుతుంది, ధాన్యం కొనుగోలు విషయంలో ఇంత జరుగుతున్న రవాణా సౌలభ్యం మిల్లర్ల వద్ద ధాన్యం దిగుమతులు, చేపించడంలో అధికారులు పూర్తిస్థాయిలో విఫలం చెందారు అనేది సత్యం అని రైతులు చెబుతున్నారు, ప్రభుత్వం ప్రతిరోజు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ధాన్యాన్ని త్వర తగిన రవాణా చేయమని ఆదేశాలు చెప్తున్న అధికారులు మాత్రం నమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వత్రా రైతుల నుండి విమర్శలు వస్తున్నాయి, ధాన్యాన్ని ఇలానే రాశులపై ఉంచి, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, రైతులు రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితులు కనబడుతున్నాయి, తక్షణమే జిల్లాస్థాయి అధికారులు స్పందించి ధాన్యాన్ని నెలలకు రమణా చేసి రవాణా జరిగిన వాహనాలను మిల్లర్లో దిగుమతులు చేసుకునేలా మిల్లర్లతో మాట్లాడి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం కౌలు రైతు సంఘం నాయకులు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్ర కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి జమలయ్య శుక్రవారం విశాలాంధ్ర పత్రికా విలేఖరితో, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ప్రసారమాధ్యమాల్లో ఆర్భాటాలు తప్ప ఆచరణలో శూన్యం అని అన్నారు గోని సంచులు లేక రైతులు అల్లాడిపోతున్నారని ధాన్యం ఎత్తుకెళ్లడానికి రవాణా సౌకర్యం లేదని ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు రైతులు తమ సొంతగా వాహనాలను ఏర్పాటు చేసుకొని మిల్లర్ల వద్దకు ధాన్యాన్ని తీసుకువెళ్తే రోజులు తరబడి ధాన్యాన్ని వాహనాల్లో నుంచి దిగుమతులు చేసుకోవడంతో రవాణా కు వచ్చిన వాహనాలకు వెయిటింగ్ చార్జీలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు మిల్లర్లు రబీ ధాన్యం మొక్క అవుతుంది అనే వంకతో 5నుండి 8 కేజీలు తరుగు విధిస్తున్నారని మిల్లర్లు పరుగు పేరుతో రైతులను కాజేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల అక్రమాలను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందని మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలం చెందిందని ఆయన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు